SS Rajamouli | రాజమౌళి కూడా దిగేశాడు.. కె. విశ్వనాథ్‌ తర్వాత ఆయనకే ఈ క్రెడిట్

SS Rajamouli విధాత‌: డబ్బు, పేరు సంపాదించడంలో సినిమా వాళ్ళకు ఉన్నన్ని మార్గాలు మరెవరికీ లేవు. అందులోనూ కాస్త హిట్ కొట్టారంటే చాలు, వాళ్ల వెనుక అటు సినిమా ఛాన్స్‌లు, ఇటు వ్యాపార ప్రకటనలకు సంబంధించి న అవకాశాలు వెంటబడతాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకుని అన్ని విధాలా భవిష్యత్ బాగుండేలా చేసుకుంటారు హీరోలు. ఒక్కో హీరో మూడు, నాలుగు బ్రాండ్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి […]

  • Publish Date - July 1, 2023 / 12:40 PM IST

SS Rajamouli

విధాత‌: డబ్బు, పేరు సంపాదించడంలో సినిమా వాళ్ళకు ఉన్నన్ని మార్గాలు మరెవరికీ లేవు. అందులోనూ కాస్త హిట్ కొట్టారంటే చాలు, వాళ్ల వెనుక అటు సినిమా ఛాన్స్‌లు, ఇటు వ్యాపార ప్రకటనలకు సంబంధించి న అవకాశాలు వెంటబడతాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకుని అన్ని విధాలా భవిష్యత్ బాగుండేలా చేసుకుంటారు హీరోలు.

ఒక్కో హీరో మూడు, నాలుగు బ్రాండ్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన సినిమాల కంటే కూడా ఎక్కువ యాడ్స్‌కే ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. సరే.. హీరో సంగతి అటుంచితే..

హిట్ దర్శకులు కూడా ఈ రూట్ పట్టడం కాస్త వింతగానే ఉన్నా ఇదే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. భారీ సినిమాలతో గొప్ప క్రేజ్ సంపాదించుకున్న దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా ఇదే బాటలో నడుస్తున్నాడు. కమర్షియల్ యాడ్స్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.

పాపులర్ మొబైల్ బ్రాండ్ అయిన ‘ఒప్పో’కు రాజమౌళి ప్రచార కర్తగా మారి ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని తాజాగా ఓ యాడ్ కూడా రెడీ చేశారు. ఆ యాడ్‌కు సంబంధించిన చిన్న టీజర్‌ను ఒప్పో విడుదల చేసింది. దీంట్లో రాజమౌళి ఇద్దరిగా డ్యుయల్ రోల్‌లో కనిపిస్తున్నారు.

ఇలా ఓ దర్శకుడు యాడ్ చేయడం ఇదే మొదటి సారి అయితే కాదు. సాగర సంగమం, శంకరా భరణం వంటి ఎన్నో క్లాసికల్ హిట్స్‌తో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్న దర్శక దిగ్గజం కె. విశ్వనాధ్ కూడా రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన ఓ యాడ్‌లో ఆ మధ్య సందడి చేశారు. ఆయన తర్వాత రాజమౌళి మాత్రమే ఈ అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం.

ఈ యాడ్ టీజర్‌లో క్రీమ్ కలర్ బ్లేజర్ ధరించి, రౌండ్ నెక్ టీషర్ట్.. మ్యాచింగ్ ప్యాంట్‌తో రాజమౌళి మరింత స్టైల్‍గా కనిపిస్తున్నాడు. నిజంగా రాజమౌళి విషయంలో ఎవరూ ఇది ఊహించి ఉండరు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన రేంజ్ అలా మారిపోయింది మరి.

Latest News