‘చిత్రం’ చేద్దామన్నారు.. చితికి చేర్చలేకపోయారు! విశ్వనాథ్‌కు దక్కని కనీస గుర్తింపు

విధాత: పెళ్లినాటి మాటలు యార్ణాలకు ఉండవు అంటారు. సంతోషంలో వెయ్యి హామీలిస్తాం.. అవన్నీ అయ్యేనా చచ్చేనా.. అవును. చచ్చినా.. నిజంగా చచ్చిపోయినా జరిగేవి కాదు. తెలంగాణ వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్దర్శకుడు విశ్వనాథ్ ఇంటికి వెళ్లి పాదాభివందనాలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు.. ఆయన సినిమాలంటే తనకెంతో ఇష్టం అన్నారు.. తెలుగు సినీపరిశ్రమకు విశ్వనాథ్ ఓ దిక్సూచి అని కొనియాడారు..ఈసారి విశ్వనాథ్ ఇంకో కొత్త సినిమా తీయాలని కోరుతూ దానికి తాను ఏ […]

  • By: krs    latest    Feb 09, 2023 5:55 AM IST
‘చిత్రం’ చేద్దామన్నారు.. చితికి చేర్చలేకపోయారు! విశ్వనాథ్‌కు దక్కని కనీస గుర్తింపు

విధాత: పెళ్లినాటి మాటలు యార్ణాలకు ఉండవు అంటారు. సంతోషంలో వెయ్యి హామీలిస్తాం.. అవన్నీ అయ్యేనా చచ్చేనా.. అవును. చచ్చినా.. నిజంగా చచ్చిపోయినా జరిగేవి కాదు. తెలంగాణ వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్దర్శకుడు విశ్వనాథ్ ఇంటికి వెళ్లి పాదాభివందనాలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు.. ఆయన సినిమాలంటే తనకెంతో ఇష్టం అన్నారు.. తెలుగు సినీపరిశ్రమకు విశ్వనాథ్ ఓ దిక్సూచి అని కొనియాడారు..ఈసారి విశ్వనాథ్ ఇంకో కొత్త సినిమా తీయాలని కోరుతూ దానికి తాను ఏ రూపంలో అయినా సహకరిస్తానని అన్నారు.

ప్రముఖులు చనిపోతే చివరి చూపు చూడని నాగార్జున! భ‌య‌మా..లేక సెంటిమెంటా?

విశ్వనాథ్ కూడా సంతోషంగా మాట్లాడారు.. కాలం గడిచిపోయింది.. విశ్వనాథ్ మరో సినిమా తీయలేదు.. దానికి కేసీఆర్ సహకరించనూ లేదు.. కానీ కాలం ఆయన్ను తీసుకెళ్లిపోయింది. అప్పట్లో అన్ని హామీలు ఇచ్చిన కేసీఆర్ కనీసం విశ్వనాథ్ భౌతిక కాయాన్ని దర్శించలేదు. ఓ సంతాపం ప్రకటించలేదు.. అంత దిగ్దర్శకుడికి కనీసం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారం కూడా చేయలేదు.

ఇటీవల ప్రముఖులు కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణలు మరణించిన విషయం తెలిసిన మరుక్షణమే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అని ప్రకటించిన ప్రభుత్వం దిగ్గజ దర్శకుడు విశ్వనాథ్‌ విషయంలో మాత్రం ఎందుకు స్పందించలేదో అంతుబట్టని విషయం.

అక్కినేని.. చివరిచూపుకు బాలయ్య ఎందుకు రాలేదు..!

ఏం.. ఆయనకేం తక్కువ.. తెలుగు సినీ రంగానికి ఆయన చేసిన సేవలకేం తక్కువ.. ఆయన చేసిన ఒక్కొచిత్రం ఒక్కో వజ్రపుతునక.. ఒక్కో సినిమా ఈ తరానికి.. ఇప్పటి ఇండస్ట్రీ టెక్నీషియన్లను ఓ కేస్ స్టడీ.. స్వాతిముత్యం.. సిరిసిరిమువ్వ.. స్వర్ణకమలం..సీతామాలక్ష్మి.. స్వయంకృషి.. సాగరసంగమం.. శంకరాభరణం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో సినిమాకు ఒక్కో గ్రంథమే రాయొచ్చు.

శంకరాభరణం సినిమా వచ్చాక సంగీతం నేర్చుకున్న యువతులు.. పిల్లలు కోకొల్లలు.. సాగరసంగమం చూసి నాట్యం నేర్చుకుని దేశవిదేశాల్లో భారత ఖ్యాతిని ఎగురవేసిన వాళ్లేందురో.. మరి అంతటి ఘనకీర్తికి కారకుడైన విశ్వనాథ్‌ను అలాగే ఒంటరిగా సాగనంపుతారా.. కనీసం అంతిమ సంస్కారం అయినా సంపూర్ణంగా..గౌరవంగా చేసే సంస్కారం కొరవడిందా.?

అంటే అవునండీ బతికున్నపుడు సవాలక్ష అంటాం.. అవన్నీ మీరు లెక్కేసి ప్రశ్నిస్తే ఎలా ? అంటే మరి సమాధానం ఉండదు.. అవును.. మనిషి బతికున్నంతవరకే పలకరింపులు.. గౌరవాలు.. ఫొటోలు.. మనిషే పోయాక ఇక అవన్నీ ఎందుకు అనుకున్నారో ఏమో.. ఆనాటి బాసలు మరిచారు.. అంతే.. ఎప్పటి మాటలు అపుడే గాలిలో కలిసిపోతాయ్.. ప్రాణాలు కలిసిపోయినట్లుగానే.

అదేవిధంగా ఈ మధ్యనే మరణించిన అలనాటి నటి జమున విషయంలోను ఇలాగే జరిగింది. ఇప్పుడు ఈ విషమంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇంటికెళ్లి మాట్లాడిన విశ్వనాథ్ గారికే దిక్కులేదు.. ఇక జమునను ఎలా పట్టించుకుంటారని సెటైర్లు వేస్తున్నారు.

Inland Taipan | ఈ పాము కాటేస్తే ఒకేసారి 100 మంది బ‌లి

20 అడుగుల గిరి నాగుపాము.. చూస్తే వ‌ణుకు త‌ప్ప‌దు..