క‌ళాత‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ క‌న్నుమూత‌

K Vishwanath | తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అపురూప చిత్రాలు అందించిన దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు, క‌ళాత‌పస్వి కె. విశ్వ‌నాథ్(92) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కే విశ్వ‌నాథ్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ మేర‌కు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. విశ్వ‌నాథ్ మృతిప‌ట్ల సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కే విశ్వ‌నాథ్ తొలి సినిమాకు నంది.. ఏ […]

క‌ళాత‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ క‌న్నుమూత‌

K Vishwanath | తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అపురూప చిత్రాలు అందించిన దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు, క‌ళాత‌పస్వి కె. విశ్వ‌నాథ్(92) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కే విశ్వ‌నాథ్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

ఈ మేర‌కు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. విశ్వ‌నాథ్ మృతిప‌ట్ల సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

కే విశ్వ‌నాథ్ తొలి సినిమాకు నంది.. ఏ సినిమా అంటే..?

కే విశ్వ‌నాథ్ పూర్తి పేరు కాశీనాధుని విశ్వ‌నాథ్‌. 1930, ఫిబ్ర‌వ‌రి 19వ తేదీన గుంటూరు జిల్లా రేపల్లెలో సుబ్ర‌హ్మ‌ణ్యం, స‌ర‌స్వ‌తమ్మ దంప‌తుల‌కు విశ్వ‌నాథ్‌ జ‌న్మించారు. గుంటూరు హిందూ క‌ళాశాల‌లో ఇంట‌ర్ విద్య పూర్తి చేశారు. ఆంధ్రా వ‌ర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. అనంత‌రం వాహిని స్టూడియోస్‌లో సౌండ్ ఆర్టిస్టుగా త‌న సినీ ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు.

శంక‌రాభ‌ర‌ణం విడుద‌లైన రోజే కె. విశ్వ‌నాథ్ శివైక్యం..

1965లో వచ్చిన ఆత్మగౌరవం సినిమాతో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన‌ కె.విశ్వనాథ్‌ ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్‌ చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు.

శంక‌రాభ‌ర‌ణం చిత్రంతో విశ్వ‌నాథ్ క‌ళాత‌పస్విగా పేరొందారు..

కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తన సత్తాచాటాడు. శుభసంకల్పం సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించిన కె.విశ్వనాథ్‌.. వజ్రం, కలిసుందాంరా, నరసింహనాయుడు, సీమసింహం, నువ్వులేకనీను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో, ఠాగూర్‌ వంటి పలు సినిమాల్లో మంచి పాత్రలతో మెప్పించారు.

చిరంజీవి సినిమాలో ముఖ్య‌మంత్రిగా న‌టించిన కె. విశ్వ‌నాథ్‌

సినిమా రంగంలో విశ్వ‌నాథ్ చేసిన కృషికి గానూ 2016లో సినీ రంగంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వ‌చ్చింది. 1992లో ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం, ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం అందుకున్నారు విశ్వానాథ్‌.

శుభ సంక‌ల్పం సినిమాతో న‌టుడిగా మారిన కె. విశ్వ‌నాథ్

శంక‌రాభ‌ర‌ణంలోని శంకరా.. నాదశరీరాపరా.. పాట మ‌హాద్భుతం.. వీడియో