Stampede | ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 12 మంది మృతి
Stampede | విధాత: ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న మైదానంలో భారీ తొక్కిసలాట జరిగి 12 మంది దుర్మరణం చెందారు. పెద్ద సంఖ్యలో క్షతగాత్రలుగా మారారు. ఎల్‌సాల్వడార్ దేశంలోని కస్కట్లాన్ స్టేడియంలో ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. సెంట్రల్ అమెరికాలోనే పెద్ద మైదానాల్లోనే ఒకటైన ఇందులో 44 వేల మంది కూర్చునేందుకు వీలుంది. అలియాంజా ఎఫ్ సీ, క్లబ్ డిపర్టివో మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. ఘటన చోటుచేసుకోవడంతో ఆటను అర్ధాంతరంగా నిలిపివేశారు. గతేడాది ఇండోనేసియాలోని ఓ గ్రౌండ్‌లో తొక్కిసలాట […]

Stampede |
విధాత: ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న మైదానంలో భారీ తొక్కిసలాట జరిగి 12 మంది దుర్మరణం చెందారు. పెద్ద సంఖ్యలో క్షతగాత్రలుగా మారారు.
ఎల్‌సాల్వడార్ దేశంలోని కస్కట్లాన్ స్టేడియంలో ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. సెంట్రల్ అమెరికాలోనే పెద్ద మైదానాల్లోనే ఒకటైన ఇందులో 44 వేల మంది కూర్చునేందుకు వీలుంది.
అలియాంజా ఎఫ్ సీ, క్లబ్ డిపర్టివో మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. ఘటన చోటుచేసుకోవడంతో ఆటను అర్ధాంతరంగా నిలిపివేశారు. గతేడాది ఇండోనేసియాలోని ఓ గ్రౌండ్‌లో తొక్కిసలాట జరిగి 135 మంది మరణించిన విషయం తెలిసిందే.