football world record| అత్యంత ఎత్తులో ఫుట్ బాల్ ఆట..వరల్డ్ రికార్డు

భూమిపై మైదానంలో ఆడే ఫుట్ బాట్ ఆటను కొందరు సాహసికులు ఏకంగా భూమి, ఆకాశం మధ్యలో ఆడేసి కొత్త రికార్డు సృష్టించారు. ఏకంగా భూమి నుండి 5,900 అడుగుల ఎత్తులో గాలిలో ఏర్పాటు చేసిన మైదానంలో ఫుట్‌బాల్ ఆడిన సంఘటన వైరల్ మారింది. గాలిలో ఎగిరే వేడి బెలూన్ కు ఏర్పాటు చేసిన మ్యాట్ పై వారు ఫుట్ బాల్ ఆడారు.

football world record| అత్యంత ఎత్తులో ఫుట్ బాల్ ఆట..వరల్డ్ రికార్డు

విధాత: భూమిపై మైదానంలో ఆడే ఫుట్ బాట్ ఆటను కొందరు సాహసికులు ఏకంగా భూమి, ఆకాశం మధ్య(sky football match)లో ఆడేసి కొత్త రికార్డు సృష్టించారు. ఏకంగా భూమి నుండి 5,900 అడుగుల ఎత్తులో గాలిలో ఏర్పాటు చేసిన మైదానంలో ఫుట్‌బాల్ ఆడిన సంఘటన వైరల్ మారింది. గాలిలో ఎగిరే వేడి బెలూన్( hot air balloon match)కు ఏర్పాటు చేసిన మ్యాట్ పై వారు ఫుట్ బాల్ ఆడారు.  వీడియోలో ఒక విమానం వారి చుట్టూ తిరుగుతుండగా ఆ బృందం సాకర్ ఆడుతున్నట్లు కనిపించింది.

భూమి నుండి 5900 అడుగుల ఎత్తులో వేడి గాలి బెలూన్ నుండి సాకర్ మ్యాచ్ నిర్వహించిన మొదటి వ్యక్తిగా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించినట్లు రష్యన్ ఎక్స్‌ట్రీమ్ అథ్లెట్ సెర్గీ బోయ్ట్సోవ్ పేర్కొన్నాడు.
“మేము కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాము. 1800 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే మొట్టమొదటి వేడి గాలి బెలూన్ ఫుట్‌బాల్ మ్యాచ్” ఇది అని వెల్లడించారు. అన్నారు. “హాట్ ఎయిర్ బెలూన్‌లో మొదటి ఫుట్‌బాల్ మ్యాచ్” అంటూ వీడియోను ఇన్స్టాలో పోస్టు చేశారు.