Elephant Calf Plays With Pumpkin : గుమ్మడికాయతో ఫుట్‌బాల్ ఆడిన ఏనుగు.. వీడియో వైరల్
అమెరికాలోని ఓరెగన్ జూలో 8 నెలల ఏనుగు పిల్ల ‘తులా-తు’ గుమ్మడికాయతో ఫుట్‌బాల్ ఆడిన వీడియో వైరల్ అయింది. క్రీడాకారుల మాదిరిగా గుమ్మడికాయను నెట్టుతూ ఆడిన ఈ గున్న ఏనుగు ఆటను జూ అధికారులు విడుదల చేశారు.

విధాత : ఏనుగులు ఎప్పుడు బీభత్సం సృష్టిస్తాయో..ఎప్పుడు అల్లరి పనులతో అలరిస్తుంటాయో అర్ధం చేసుకోవడం కష్టమే. జూపార్కులలో, జంతు పునరావాస కేంద్రాల్లో అక్కడక్కడ ఏనుగు పిల్లలను ఆడించేందుకు ఫుట్ బాల్స్ వాటి ముందు వేయడం చూస్తుంటాం. తమ ముందున్న బాల్స్ తో ఏనుగు పిల్లలు సరదాగా ఆటాలాడటం తరుచుగా వెలుగుచూస్తుంటాయి. తాజాగా
అమెరికాలోని ఓరెగన్ జూలో ఓ ఏనుగు పిల్ల గుమ్మడికాయతో ఫుట్ బాల్ ఆడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
8 నెలల వయసున్న ‘తులా-తు’ ఏనుగు పిల్ల.. క్రీడాకారులు ఫుట్‌బాల్ ఆడినట్టు గుమ్మడికాయతో ఫుట్ బాల్ ఆడింది. దీనికి సంబంధించిన దృశ్యాలను జూ అధికారులు విడుదల చేయగా..అవి కాస్తా వైరల్ గా మారాయి. ఏటా పసిఫిక్ జెయింట్ వెజిటెబుల్ గ్రోవర్స్ సభ్యులు జూకు గుమ్మడికాయలను విరాళంగా ఇస్తారు. ఏనుగులు వాటిని చిదిమేసి ఆహారంగా తీసుకుంటాయి. పెద్ద ఏనుగులు ఆ గుమ్మడికాయలను ఆహారంగా తీసుకోగా..ఈ గున్న ఏనుగు మాత్రం దాంతో ఫుట్ బాల్ ఆడుకోవడం అలరించింది.
Baby elephant plays ball with a small pumpkin as her family smashes massive ones. pic.twitter.com/fj6inijv9S
— The Associated Press (@AP) October 21, 2025