Leopard vs Dog | కుక్క దెబ్బ‌కు పిల్లిలా పారిపోయిన చిరుత పులి.. గ్రామ సింహాం తెగువ‌కు నెటిజ‌న్లు ఫిదా..!

Leopard vs Dog | చిరుత పులులు( Leopards ).. ఇత‌ర జంతువులను( Animals ) వెంటాడి వేటాడి.. ర‌క్తాన్ని క‌ళ్లారా చూస్తాయి. కానీ ఇందుకు ఈ సీన్ రివ‌ర్స్. ఓ కుక్క( Dog ).. చిరుత‌ను వెంటాడి వేటాడి.. దాన్ని ర‌క్తాన్ని క‌ళ్లారా చూసింది శున‌కం. గ్రామ సింహాం( Village Lion ) చూపించిన తెగువ‌కు నెటిజ‌న్లు ఫిదా అయిపోయారు.

Leopard vs Dog | కుక్క దెబ్బ‌కు పిల్లిలా పారిపోయిన చిరుత పులి.. గ్రామ సింహాం తెగువ‌కు నెటిజ‌న్లు ఫిదా..!

Leopard vs Dog | చిరుత‌లంటేనే( Leopards ) ఇత‌ర జంతువుల‌కు గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి. చిరుత నుంచి త‌ప్పించుకునేందుకు మిగ‌తా జంతువులు( Animals ) ర‌క‌ర‌కాల మార్గాల‌ను అన్వేషిస్తూ.. దాని కంట ప‌డ‌కుండా పారిపోతుంటాయి. కానీ ఓ కుక్క మాత్రం చిరుత‌తో వీరోచితంగా పోరాటం చేసింది. చిరుత గాండ్రిపుల‌కు ఏ మాత్రం భ‌య‌ప‌డిన గ్రామ సింహాం( Village Lion ).. దానికి ముచ్చెట‌మ‌లు ప‌ట్టించింది. చివ‌ర‌కు చిరుత‌నే కుక్క దాడికి భ‌య‌ప‌డి చెట్ల పొద‌ల్లోకి పారిపోయింది.

మ‌హారాష్ట్ర( Maharashtra ) నాసిక్‌( Nashik )లోని నిఫాడ్ ప్రాంతం అది. అక్క‌డున్న ఓ ఇంటి ఆవ‌ర‌ణ‌లోకి చిరుత ప్ర‌వేశించింది. అక్క‌డే కాప‌లాగా ఉన్న ఓ కుక్క‌.. చిరుత పులిని చూసి వ‌ణ‌క‌లేదు.. బెద‌ర‌లేదు. నువ్వెంత అన్న‌ట్టు చిరుత‌పై కుక్క దాడి చేసింది. చిరుత పులి గొంతును అదిమిప‌ట్టిన కుక్క‌.. ఎంతో నైపుణ్యంతో 300 మీట‌ర్ల వ‌ర‌కు లాక్కొచ్చింది. అప్ప‌టికే చిరుత‌కు చ‌చ్చినంత ప‌నైంది. ఈ క్కుకకు మ‌రో కుక్క తోడైంది. చివ‌ర‌కు చేసేదేమీ లేక పిల్లిలా చిరుత పులి తోక ముడిచింది. తీవ్ర గాయాల‌పాలైన చిరుత పులి.. మెల్లిగా అక్క‌డున్న చెట్ల పొద‌ల్లోకి పారిపోయింది.

ఈ దృశ్యాల‌న్నీ అక్క‌డున్న ఓ వ్య‌క్తి త‌న కెమెరాలో బంధించాడు. ప్ర‌స్తుతం చిరుత‌పై కుక్క చేసిన వీరోచిత పోరాటం దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కుక్క తెగువ‌ను నెటిజ‌న్లు అభినందిస్తున్నారు మాకు కూడా ఇలాంటి కుక్క ఒక‌టి కావాల‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. గ్రామ సింహాల ముందు చిరుతలు ప‌రార్ కావాల్సిందేన‌ని నెటిజ‌న్లు అంటున్నారు. మొత్తానికి చిరుత‌కు ముచ్చెట‌మలు ప‌ట్టించిన శున‌కంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి..