Subhalekha Sudhakar | శుభలేఖ సుధాకర్.. రీ ఎంట్రీలో ఇరగదీస్తున్నాడుగా

Subhalekha Sudhakar విధాత‌: శుభలేఖ సుధాకర్.. ఒకప్పుడు హీరోగా చక్రం తిప్పాలనుకున్న ఈ నటుడి ప్రయత్నం ఫలించలేదు కానీ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోలకు ఫ్రెండ్‌గా చాలా గొప్ప గొప్ప పాత్రలలో నటించాడు. వయసు మీద పడటం చేతనో, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు కానీ.. ఈ మధ్య ఆయన కొన్నాళ్ల పాటు నటనకు దూరంగా ఉన్నారు. అయితే సినిమాలు చేయనప్పటికీ.. కొన్ని సీరియల్స్‌లో మాత్రం ఆయన నటిస్తూ.. నటన ఆపలేదనేలా క్లారిటీ ఇస్తూనే వచ్చారు. […]

  • Publish Date - May 8, 2023 / 04:58 AM IST

Subhalekha Sudhakar

విధాత‌: శుభలేఖ సుధాకర్.. ఒకప్పుడు హీరోగా చక్రం తిప్పాలనుకున్న ఈ నటుడి ప్రయత్నం ఫలించలేదు కానీ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోలకు ఫ్రెండ్‌గా చాలా గొప్ప గొప్ప పాత్రలలో నటించాడు. వయసు మీద పడటం చేతనో, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు కానీ.. ఈ మధ్య ఆయన కొన్నాళ్ల పాటు నటనకు దూరంగా ఉన్నారు.

అయితే సినిమాలు చేయనప్పటికీ.. కొన్ని సీరియల్స్‌లో మాత్రం ఆయన నటిస్తూ.. నటన ఆపలేదనేలా క్లారిటీ ఇస్తూనే వచ్చారు. ఇప్పుడాయన అవసరాన్ని ఇండస్ట్రీ గుర్తించింది. చాలా గ్యాప్ తర్వాత ఆయన బిజీ నటుడిగా మారారు. ఇప్పుడొస్తున్న ప్రతి చిత్రంలోనూ దాదాపు ఆయన నటిస్తున్నారు. దర్శకులు ఆయనకు ప్రత్యేకంగా పాత్రలని సృష్టిస్తున్నారు.

‘వకీల్ సాబ్’ చిత్రంలో చిన్న పాత్రతో మళ్లీ లైన్‌లోకి వచ్చిన సుధాకర్.. అప్పటి నుంచి వరుస చిత్రాలలో అవకాశాలను అందుకుంటున్నారు. రీసెంట్‌గా విడుదలైన ‘రామబాణం’ చిత్రంలో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. హీరో గోపీచంద్, జగపతిబాబులను చిన్నోడా, పెద్దోడా అంటూ.. వారి కుటుంబంలోని మనిషిగా కలిసిపోయే పాత్రలో శుభలేఖ సుధాకర్ నటన ఆకట్టుకుంటుంది.

ఒకానొక స్టేజ్‌లో కాస్త ఓవర్ అనిపించినప్పటికీ.. ఆ తరహా పాత్రలు చేయాలంటే.. ఇప్పుడు శుభలేఖ సుధాకరే బెస్ట్ ఆప్షన్‌గా మారారనేది మాత్రం వాస్తవం. ఆయనకు పోటీ నటుడైన నాగినీడు.. ఈ మధ్యకాలంలో హుషారుగా లేరు. దీంతో ఆయన చేయాల్సిన పాత్రలు కూడా ఇప్పుడు సుధాకర్‌ని వరిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే అప్పటి కంటే కూడా ఇప్పుడు ఆయనకి వైవిధ్యమైన పాత్రలు వస్తుండటం విశేషం. జడ్జిగా, బాబాగా, తాతగా ఇలా అనేక రకాల పాత్రలు సుధాకర్‌ని వరిస్తున్నాయి.

1999 తర్వాత సుమారు 5 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న సుధాకర్.. మళ్లీ 2004లో ‘ఆ నలుగురు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి సంవత్సరానికి ఒకటీ రెండు చిత్రాలలో మాత్రమే ఆయన నటిస్తూ వస్తున్నారు. మధ్యలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘భీష్మ’, ‘వకీల్ సాబ్’ చిత్రాలలో చిన్న పాత్రలు దక్కినా.. ఆయనకు మంచి గుర్తింపునే ఇచ్చాయి.

2021లో దాదాపు ఆయన 10 చిత్రాలలో నటించారు. 2022లో ఐదారు చిత్రాలలో కనిపించిన సుధాకర్.. 2023లో ఇప్పటికే విడుదలైన చాలా చిత్రాలలో ఆయన కనిపించారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంలో ఆయన చేసిన తాత పాత్రకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడొచ్చిన ‘రామబాణం’ చిత్రంలో కూడా ఆయనకు శ్రీవాస్ మంచి పాత్రను రాశారు. మొత్తంగా అయితే.. రీ ఎంట్రీలో మాత్రం శుభలేఖ సుధాకర్ బిజీ ఆర్టిస్ట్‌గా మారారనేది మాత్రం నిజం. టాలెంట్‌కి ఏజ్‌తో పనిలేదనే విషయాన్ని శుభలేఖ సుధాకర్ నిరూపిస్తున్నారు. అదీ విషయం..

Latest News