Sukhesh Chandrashekar | BRS పార్టీకి రూ. 75 కోట్లు ఇచ్చాను.. సంచలనం సృష్టిస్తున్న సుఖేశ్ లేఖ
Sukhesh Chandrashekar | విధాత: మనీ లాండరింగ్ కేసులో అరెస్టు అయి తీహార్ జైల్లో ఉంటున్న సుఖేశ్ చంద్రశేఖర్.. భారత రాష్ట్ర సమితి (BRS Party), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై బాంబు పేల్చాడు. అరవింద్ కేజ్రీవాల్ సూచనల మేరకు హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఓ వ్యక్తికి రూ. 75 కోట్లు ఇచ్చానని సుఖేశ్ ఓ లేఖ విడుదల చేశాడు. కేజ్రీవాల్ తరపున ఈ నగదు ఇచ్చానని, ఆయనతో మాట్లాడిన వాట్సాప్ చాట్ ను బయట […]
Sukhesh Chandrashekar |
విధాత: మనీ లాండరింగ్ కేసులో అరెస్టు అయి తీహార్ జైల్లో ఉంటున్న సుఖేశ్ చంద్రశేఖర్.. భారత రాష్ట్ర సమితి (BRS Party), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై బాంబు పేల్చాడు. అరవింద్ కేజ్రీవాల్ సూచనల మేరకు హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఓ వ్యక్తికి రూ. 75 కోట్లు ఇచ్చానని సుఖేశ్ ఓ లేఖ విడుదల చేశాడు. కేజ్రీవాల్ తరపున ఈ నగదు ఇచ్చానని, ఆయనతో మాట్లాడిన వాట్సాప్ చాట్ ను బయట పెడుతానని సుఖేశ్ తన లేఖలో తెలిపాడు.
2020లో బీఆర్ఎస్ ఆఫీసు వద్దకు వచ్చి రేంజ్ రోవర్ కారులో ఉన్న ఏపీ అనే వ్యక్తికి రూ. 15 కోట్లు ఇచ్చినట్లు సుఖేశ్ తెలిపాడు. అయితే చాటింగ్‌లో కోడ్ పదాలు వాడినట్లు పేర్కొన్నారు. 15 కేజీల నెయ్యి పేరిట.. ఐదు సార్లు రూ. 15 కోట్ల చొప్పున తరలించినట్లు స్పష్టం చేశారు.
కేజ్రీవాల్ అవినీతి, అక్రమాలు అన్నీ బయటపెడుతానని సుఖేశ్ చెప్పారు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ చెప్పినట్లే డబ్బులు చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే రూ. 75 కోట్ల నగదును ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధం ఉన్న వ్యక్తికే ఇచ్చినట్లు సుఖేశ్ తెలిపాడు.
‘ ఏపీ’ కూర్చున్న రేంజ్ రోవర్ కారు నెంబర్ 6060గా లేఖలో పేర్కొన్నాడు. కేజ్రీవాల్‌ను త్వరలో తీహర్ క్లబ్‌కు ఆహ్వానిస్తానంటూ ఇటీవల కోర్టులో హాజరైనప్పుడు సుఖేశ్ చంద్రశేఖర్ విలేకరులతో చెప్పాడు. సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ రాజధాని ఢిల్లీతో పాటు తెలంగాణలో సంచలనం రేపుతోంది.
రూ.200 కోట్ల హవాలా కేసులో సుఖేశ్ చంద్రశేఖర్ నిందితుడు. వందల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. జైలు బయట ఎంత విలాసవంతంగా బతికాడో.. జైల్లో కూడా అదే అనుసరించాడు.
ఆకస్మాత్తుగా అతడి జైలు గదిని తనిఖీ చేసిన అధికారులు అక్కడ దొరికిన ఖరీదైన వస్తువులను చూసి విస్మయానికి గురయ్యారు. ఎందుకంటే అతడు వాడే బ్రాండెడ్ గుస్సీ చెప్పుల విలువ రూ.లక్షన్నర కాగా, అతడి 3 జీన్స్ ప్యాంట్ల విలువ రూ.80 వేలు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram