Suhasini | సుహాసిని.. ఆ హీరోయిన్ పెళ్లి చెడగొట్టాలని చూసిందా.!
Suhasini | సినిమా ఇండస్ట్రీలో కొంత మంది స్టార్స్ మధ్య స్నేహ పూర్వక వాతావరణం ఉంటుంది. కలిసినప్పుడు పలకరించుకోవడం, ఫంక్షన్స్‌కి వెళ్లడం, వీలుంటే టూర్స్ వేయడం జరుగుతుంటుంది. అయితే కొందరి మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే అప్పటి హీరోలు సుహాసిని, సుమలత,రాధ, రాధిక, శ్రీదేవి, జయప్రద వంటి వారు చాలా ఫ్లెండ్లీగా ఉండేవారు. ఒకరి విషయాలు ఒకరు చేసుకోవడం, ఇబ్బందులు ఏర్పడిన సమయంలో ఆదుకోవడం వంటివి జరిగేది. అయితే సుహాసిని.. సుమలత పెళ్లి చెడగొట్టడానికి […]

Suhasini |
సినిమా ఇండస్ట్రీలో కొంత మంది స్టార్స్ మధ్య స్నేహ పూర్వక వాతావరణం ఉంటుంది. కలిసినప్పుడు పలకరించుకోవడం, ఫంక్షన్స్‌కి వెళ్లడం, వీలుంటే టూర్స్ వేయడం జరుగుతుంటుంది. అయితే కొందరి మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.
అయితే అప్పటి హీరోలు సుహాసిని, సుమలత,రాధ, రాధిక, శ్రీదేవి, జయప్రద వంటి వారు చాలా ఫ్లెండ్లీగా ఉండేవారు. ఒకరి విషయాలు ఒకరు చేసుకోవడం, ఇబ్బందులు ఏర్పడిన సమయంలో ఆదుకోవడం వంటివి జరిగేది. అయితే సుహాసిని.. సుమలత పెళ్లి చెడగొట్టడానికి ప్లాన్ చేసిందనే వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
వివారళ్లోకి వెళితే సుమలత.. కన్నడ రెబల్ స్టార్, దివంగత నటుడు అంబరీష్‌ని ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే పెళ్లికి ముందు సుహాసిని.. ఓ సారి సుమలత దగ్గరకి వెళ్లి అంబరీష్.. నీకు అంతగా సెట్ అవ్వడు. అతన్ని ప్రేమించడం మానేస్తే నీకే మంచిది అని చెప్పిందట. అయితే సుమలత అప్పటికే అంబరీష్ ప్రేమలో పూర్తిగా మునిగి తేలుతూ ఉన్న నేపథ్యంలో అస్సలు పట్టించుకునేది కాదు.
అసలు సుహాసిని ఎందుకు చేసుకోవద్దన్నది అంటే అంబరీష్ చూడ్డానికి విలన్‌లా చాలా ర్యాష్‌గా కనపించేవా రు. అతడిని చేసుకుంటే పరిస్థితి ఏంటా అని భయపడి సుహాసిని వద్దని చెప్పిందట.
సుహాసిని ఎంత చెప్పిన కూడా సుమలత అంబరీష్‌ని వివాహం చేసుకొని సంతోషంగానే ఉన్నది. ఓ సారి.. సుహసినినే అంబరీష్ ఇదే విషయమై నేనంటే నీకు ఎందుకు అంత పగ.. మీ ఫ్రెండ్ కి నన్ను చేసుకోవద్దని చాలా చాడీలు చెప్పావట అని అడిగాడట. దానికి ఆమె మీ పెళ్లి జరగకూడదని నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. సుమలత ఇన్నోసెంట్ అని అలా చెప్పానని సుహాసిని పేర్కొందట.
ఈ విషయాలని నటి సుమలత ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆ నాటి ముచ్చట్లు తాజాగా ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు సుహాసిని, సుమలత ఎంతో అన్యోన్యంగా ఉండడం విశేషం.