Vijay Devarakonda | విజయ్-రష్మిక పెళ్లి రూమర్స్ మధ్య పాత ఫోటోలు వైరల్… విదేశీ అమ్మాయితో క్లోజ్‌గా..?

Vijay Devarakonda | టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నాల పెళ్లి వార్తలు. ఈ జంట త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

  • By: sn |    movies |    Published on : Feb 12, 2026 10:27 AM IST
Vijay Devarakonda | విజయ్-రష్మిక పెళ్లి రూమర్స్ మధ్య పాత ఫోటోలు వైరల్… విదేశీ అమ్మాయితో క్లోజ్‌గా..?

Vijay Devarakonda | టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నాల పెళ్లి వార్తలు. ఈ జంట త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా అయిపోయిందని, ఈ నెలాఖరులో పెళ్లి జరుగుతుందని పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. విజయ్ ఇంట్లో రష్మిక కనిపించడం, కలిసి వెకేషన్లకు వెళ్లిన ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు ఈ వార్తలను నిజమని నమ్ముతున్నారు.

అయితే ఈ పెళ్లి రూమర్స్ మధ్య మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని పాత ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడం చర్చనీయాంశమైంది. ఆ ఫోటోలలో విజయ్ ఒక యువతితో సన్నిహితంగా కనిపిస్తున్నాడు. ఈ యువతి విజయ్ మాజీ ప్రియురాలంటూ నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా రెడ్డిట్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆ యువతి బెల్జియంకు చెందిన మోడల్ అని, విజయ్ ఆమెతో కొంతకాలం డేటింగ్‌లో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కోవిడ్ కాలంలో కూడా ఆమెను కలిసేందుకు యూరప్ వెళ్లాడని, ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వచ్చారనే కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే ఈ సమాచారానికి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. అందువల్ల ఇవన్నీ కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోతున్నాయి.

మరోవైపు అభిమానులు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. ఆ యువతి పేరు వర్జీనీ అని, 2016లో వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాలో చిన్న పాత్రలో నటించిందని చెబుతున్నారు. సినిమా తర్వాత ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారని, ఆ సమయంలో తీసుకున్న ఫోటోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయని వివరణ ఇస్తున్నారు. కేవలం స్నేహితులే తప్ప ప్రేమ సంబంధం లేదని వారు అంటున్నారు. పెళ్లి వార్తల సమయంలో కావాలనే కొందరు పాత ఫోటోలను బయటకు తీసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.

ఇక విజయ్–రష్మిక పెళ్లి విషయానికి వస్తే, ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో గ్రాండ్‌గా వివాహం జరగబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో పెళ్లి జరగనుందని టాక్. అనంతరం మార్చి మొదటి వారంలో హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ జంట నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఇవన్నీ గాసిప్స్ గానే మిగిలాయి.

మొత్తానికి విజయ్–రష్మిక పెళ్లి వార్తల మధ్య పాత ఫోటోలు వైరల్ కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిజం ఏమిటి, రూమర్ ఏది అన్నది అధికారిక ప్రకటన వచ్చేవరకు తెలియాల్సి ఉంది. అప్పటివరకు ఈ కథనాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా కొనసాగడం ఖాయం.