స్కూటీ పై ఇంటింటికి వెళ్లి చెక్కుల పంపిణీ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

మంత్రి సింప్లిసిటీకి జనం ఫిదా
విధాత, ఉమ్మడి నల్లగొండ జిల్లా బ్యూరో : ఆపత్కాల సమయంలో అన్నా.. అని పిలవగానే అభిమానులకు అండగా ఉండే మంత్రి జగదీష్ రెడ్డి మొన్న ఆటోలో వెళ్లి లబ్దిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. శనివారం సూర్యాపేటలో తన అభిమాని నరేష్ కొనుగోలు చేసిన నూతన స్కూటీని ఆయన కోరిక మేరకు నడిపిన మంత్రి, తన అధికారిక కాన్వాయ్ ను వదిలి, స్కూటీపైనే పట్టణంలో పర్యటించారు.

ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
అదే స్కూటీపై కల్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారుల ఇళ్లకు స్వయం వెళ్లి చెక్కులను పంపిణీ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. మంత్రి కాన్వాయ్ కోసం ఎదురుచూస్తున్న నేతలు, లబ్ధిదారులు మంత్రి స్కూటీపై రావడం చూసి ఆశ్చర్యానందాలు వ్యక్తం చేశారు. ‘ఇదీ.. మన మంత్రి జగదీశన్న సింప్లిసిటీ..’ అంటూ పలువురు చర్చించుకోవడం కనిపించింది