స్విగ్గీలో లే ఆఫ్స్.. 350-400 ఉద్యోగాల కోత
ప్రముఖ ఆన్‌లైన్ ఆహార సరఫరా సంస్థ స్విగ్గీ.. ఉద్యోగాల్లో కోత విధించబోతున్నది. నిర్వహణ ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా 350-400 ఉద్యోగాల కోతకి సిద్దం

- వచ్చేవారాల్లో మొదలు
విధాత: ప్రముఖ ఆన్‌లైన్ ఆహార సరఫరా సంస్థ స్విగ్గీ.. ఉద్యోగాల్లో కోత విధించబోతున్నది. నిర్వహణ ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా రాబోయే రోజుల్లో 350-400 ఉద్యోగాలను తగ్గించడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కంపెనీ నిర్మాణాన్ని సులభతరం చేయడానికి, కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించడానికి ఉద్యోగాల్లో కోత విధించాలని అంచనా వేస్తున్నట్టు ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి.
సాంకేతికత, కాల్ సెంటర్, కార్పొరేట్ వ్యవహారాల్లో పనిచేస్తున్న బృందాల్లో ఉద్యోగ కోతలు ఉంటాయని తెలుస్తున్నది. రాబోయే వారాల్లో ఉద్యోగుల తీసివేత ప్రక్రియలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం స్విగ్గీ సంస్థలో దాదాపు 6,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని అంచనా.