KCR SIT inquiry| ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. నందినగర్ నివాసంలో కేసీఆర్ ను సిట్ బృందం విచారించింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Feb 01, 2026, 7:56 pm IST
Read Time: 2 mins
KCR SIT inquiry| ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ

విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. నందినగర్ నివాసంలో కేసీఆర్ ను సిట్ బృందం విచారించింది.ఈ కేసు విచారణలో ఇప్పటి వరకు నిందితుల నుంచి సేకరించిన వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ స్టేట్మెంట్ ను రికార్డు చేసుకున్నారు. విచారణ ప్రక్రియను వీడియోగ్రఫీ చేశారు. నాలుగున్నర గంటల పాటు కేసీఆర్ ను విచారించారు.

కేసీఆర్ ను విచారించిన సిట్ బృందంలో ఐపీఎస్ లు విజయ్ కుమార్, నారాయణరెడ్డి, నాన్ క్యాడర్ ఎస్పీ
రవీందర్ రెడ్డి, ఏసీపీలు శ్రీధర్, కె ఎస్ రావు, వెంకటగిరి, ఒక సీఐ, ఆరుగురు ఎస్ఐల తో పాటు మొత్తం 15 మంది అధికారులు ఉన్నారు. వారిలో ఆరుగురు అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించారు.