Taapsee | సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందనేది చాలా మంది హీరోయిన్స్ చెబుతున్నమాట. ప్రతి ఒక్కరు కూడా తమ కెరీర్లో కాస్టింగ్ కౌచ్ వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పరిస్థితుల కారణంగా సైలెంట్‌గా ఉండాల్సి వచ్చింది. కాని మీటూ ఉద్యమం తర్వాత చాలా మందిలో ధైర్యం వచ్చింది. తమకు ఎదురైన విచిత్ర పరిస్థితుల గురించి నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. తాజాగా తాప్సీ కొందరు స్టార్ హీరోలు తనని చాలా ఇబ్బందులకి గురి చేశారని షాకింగ్ కామెంట్స్ చేసింది. […]
Taapsee |
సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందనేది చాలా మంది హీరోయిన్స్ చెబుతున్నమాట. ప్రతి ఒక్కరు కూడా తమ కెరీర్లో కాస్టింగ్ కౌచ్ వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పరిస్థితుల కారణంగా సైలెంట్‌గా ఉండాల్సి వచ్చింది. కాని మీటూ ఉద్యమం తర్వాత చాలా మందిలో ధైర్యం వచ్చింది. తమకు ఎదురైన విచిత్ర పరిస్థితుల గురించి నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.
తాజాగా తాప్సీ కొందరు స్టార్ హీరోలు తనని చాలా ఇబ్బందులకి గురి చేశారని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ఇప్పుడు బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకప్పుడు సౌత్‌లో సత్తా చాటిన తాప్సీ ఇప్పుడు బీటౌన్‌లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతుంది. ఎక్కువగా కంటెంట్ ఉన్న చిత్రాలు చేస్తుండడంతో ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ దక్కింది.
తెలుగులో తాప్సీ.. గోపీచంద్, రవితేజ, మంచు సోదరుల లాంటి మీడియం రేంజ్ హీరోలతో చేసిన వెంకటేష్ వంటి స్టార్ హీరోతో నటించిన కూడా పెద్దగా ఆదరణ దక్కలేదు. దీంతో బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. మరోవైపు తాను పలు విషయాలపై చాలా ఓపెన్‌గా మాట్లాడుతూ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది.
తాజా ఇంటర్వ్యూలో తాప్సీ.. కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సౌత్ కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ కాస్టింగ్ ఎక్కువగా ఉందని షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌కి వచ్చిన కొత్తలో తనకి చాలా మంది హీరోలు, దర్శకులు ఫోన్ చేసి విసిగించారు.
అర్ధరాత్రి గెస్ట్ హౌజ్‌కి రమ్మని అడిగేవారు. తాను అలాంటి దానిని కాదని చెప్పిన కూడా ఫోన్స్ చేసి చాలా విసిగించేవారు. ఇద్దరు హీరోలు అయితే నాతో డేటింగ్ చేస్తామంటూ టార్చర్ పెట్టారు.
మా మాట వినికపోతే సినిమాల్లో ఛాన్స్ లు రాకుండా చేస్తామని బెదిరించారు. అవన్నీ తాను లైట్‌గా తీసుకొని, తన టాలెంట్‌తో ఇక్కడ వరకు వచ్చాను అంటూ తాప్సి చెప్పుకొచ్చింది. తాప్సీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇక తాప్సీ కొన్నిసార్లు చేసే పనులు కూడా వివాదాలు సృష్టిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.
ఆ మధ్య తాప్సీ తన అందాలని కవర్ చేసుకునేందుకు భారీ ఆభరణం ధరించి ఉండగా, అందులో హిందువులు పవిత్రంగా కొలిచే లక్ష్మీదేవి బొమ్మ ఉంది. తన అందాలపై పవిత్రమైన లక్ష్మీ మాత ఆభరణం ధరించి వారి మనోభావాలని దెబ్బతీసిన నేపథ్యంలో తాప్సీపై ఫుల్ ఫైర్ అయ్యారు.