Sushanth విధాత: ఓ హీరో పక్కన హీరోయిన్గా నటిస్తే ఆమె మరో సినిమాలో హీరోయిన్‌గానే చేస్తుంది తప్పితే మరో క్యారెక్టర్ చేయదు. అలా ఒకప్పుడు ఉండేది. ఇప్పుడలా ఎక్కడో కానీ జరగడం లేదు. ఓ సినిమాలో హీరో పక్కన హీరోయిన్గా చేస్తే, మరో సినిమాలో చెల్లిగా చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పటి రోజుల్లో హీరో హీరోయిన్స్ ఇద్దరి మధ్యా కుదిరిన కెమిస్ట్రీని దృష్టిలో పెట్టుకునో ఏమో పెద్దగా అలాంటి సినిమాలు రావడంలేదు. ఇక ఇదే […]
Sushanth
విధాత: ఓ హీరో పక్కన హీరోయిన్గా నటిస్తే ఆమె మరో సినిమాలో హీరోయిన్‌గానే చేస్తుంది తప్పితే మరో క్యారెక్టర్ చేయదు. అలా ఒకప్పుడు ఉండేది. ఇప్పుడలా ఎక్కడో కానీ జరగడం లేదు. ఓ సినిమాలో హీరో పక్కన హీరోయిన్గా చేస్తే, మరో సినిమాలో చెల్లిగా చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి.
అయితే ఇప్పటి రోజుల్లో హీరో హీరోయిన్స్ ఇద్దరి మధ్యా కుదిరిన కెమిస్ట్రీని దృష్టిలో పెట్టుకునో ఏమో పెద్దగా అలాంటి సినిమాలు రావడంలేదు. ఇక ఇదే విషయంలో జూనియర్ ఆర్టిస్ట్‌లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎలాంటి అనుమానం లేకుండా చెల్లెల్లుగా, భార్యగా ఇలా చాలా పాత్రలను ఒకే వ్యక్తితో చేసేస్తారు.
ఇదిలా ఉంటే ఈ మధ్య అక్కినేని సుశాంత్ నటిస్తున్న సినిమా ‘భోళాశంకర్’. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతున్న సందర్భంగా హైపర్ ఆది మూవీ టీమ్‌ని ఇంటర్వ్యూ చేశాడు. ఈ సినిమాలో సుశాంత్‌కి జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. అయితే చిరంజీవికి జంటగా తమన్నా చేస్తుంది.
ఇందులో తమన్నా వరసకి సుశాంత్‌కి చెల్లెలు అవుతుందట. ఒకప్పుడు మీ పక్కన హీరోయిన్గా చేసిన తమన్నా.. ఇప్పుడు చెల్లెలుగా చేస్తుంటే ఏలా ఫీలయ్యారని ఆది అడిగిన ప్రశ్నకు సుశాంత్ చాలా క్లియర్‌గా సమాధానం చెప్పాడు. తమన్నా చెల్లిగా చేస్తున్నందుకు ఫీల్ కావడం కంటే కీర్తికి జంటగా చేస్తున్నందుకు ఎక్కువ హ్యాపీగా ఫీలయ్యానని చెప్పాడు.
అన్నాచెల్లెళ్ళ అనుబంధం మీద గతంలో చాలా సినిమాలు వచ్చినా వాటిలో కొన్నిసినిమాలు మాత్రం ఇప్పటికీ గుర్తుండి పోయాయి. అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని హైలెట్ చేస్తూ సాగే కథలకు మంచి డిమాండ్ ఉంది. గతంలో వచ్చిన సినిమాల్లో టక్కున గుర్తుకొచ్చేవి రక్తసంబంధం. ఇందులో అన్నాచెల్లెళ్ళుగా నటించింది ఎన్టీఆర్, సావిత్రి, ఈ సినిమా ఇప్పటికీ కన్నీళ్ళు తెప్పిస్తుంది. సెంటిమెంట్ పరంగా చాలా కనెక్ట్ అవుతాం.
అలాగే ఆమధ్య వచ్చిన గోరింటాకు, ఇందులో రాజశేఖర్, మీరాజాస్మిన్ కూడా అన్నాచెల్లెళ్ళ మధ్య ఉండే బాంధవ్యాన్ని, మమకారాన్ని గుండెలకు హత్తుకునేలా జీవించేశారు. తర్వాత చిరంజీవి అన్నయ్యగా చేసిన ‘హిట్లర్’ సినిమా కూడా మంచి హిట్ అయింది. ఇలా అన్నా చెల్లెళ్ళ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలన్నీ కూడా మంచి హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు ఇదే దారిలో చిరంజీవి, కీర్తీ సురేష్ అన్నాచెల్లెళ్ళుగా రాబోతున్నారు. ఇందులో సుశాంత్, తమన్నా కూడా నటిస్తున్నారు.
గతంలో సుశాంత్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా జోడిలో వచ్చిన సినిమా ‘కాళిదాసు’. అప్పుడు జోడీగా చేసి ఇప్పుడు అన్నా చెల్లెళ్ళుగా చేయడంపై అంతా.. మళ్లీ పాత రోజులు గుర్తు చేశారనేలా అంతా మాట్లాడుకుంటున్నారు. చిరంజీవి మెయిన్ పాత్రలో చేస్తున్న ‘భోళాశంకర్’ సినిమా ఆగష్ట్ 11న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. చూడాలి.. ఇంకెన్ని ట్విస్ట్‌లు ఈ సినిమాలో ఉంటాయో.