అప్పుడు ఆలీ.. ఇప్పుడు బండ్ల గణేష్ విధాత: అఫ్ కోర్స్.. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అంటే అమితంగా అభిమానించే ఆలీ (Ali) జగన్ (Jagan) పార్టీలో చేరారు. ఇన్నాళ్లకు ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఓ గుర్తింపు దక్కింది.. అయితే ఇప్పుడు ఇంకో భక్తుడు కూడా జగన్ పాలన బాగుందని అంటున్నారు. పవన్ అంటే పడి చచ్చిపోయే బండ్ల గణేష్ (Bandla Ganesh) తాజాగా ఒక యూట్యూబ్ ఛీనల్తో మాట్లాడారు. ఏపీ(AP)లో జగన్ పాలన బాగుందని అన్నారు. […]
అప్పుడు ఆలీ.. ఇప్పుడు బండ్ల గణేష్
విధాత: అఫ్ కోర్స్.. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అంటే అమితంగా అభిమానించే ఆలీ (Ali) జగన్ (Jagan) పార్టీలో చేరారు. ఇన్నాళ్లకు ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఓ గుర్తింపు దక్కింది.. అయితే ఇప్పుడు ఇంకో భక్తుడు కూడా జగన్ పాలన బాగుందని అంటున్నారు. పవన్ అంటే పడి చచ్చిపోయే బండ్ల గణేష్ (Bandla Ganesh) తాజాగా ఒక యూట్యూబ్ ఛీనల్తో మాట్లాడారు.
ఏపీ(AP)లో జగన్ పాలన బాగుందని అన్నారు. జగన్ ఓడిపోవాలని తాను కోరుకోవడం లేదన్నారు. అంతటితో ఆగకుండా టీడీపీ – జనసేన(TDP-Janasena) కూటమి గెలవాలని కోరుకోవడం లేదని అగ్గి రాజేశారు. టీడీపీ–జనసేన పొత్తుపై యాంకర్ ప్రశ్నించగా వారు పొత్తు పెట్టుకున్నట్టు మీకు చెప్పారా అని ఎదురు ప్రశ్న వేశారు.
టీడీపీ–జనసేన కలిస్తే కడుపు వస్తుందా? కడుపు రాకుండానే డెలివరీ అవుతుందా అని అన్నారు. దేశంలో ఎక్కడా ఉచిత పథకాలు ఉండ కూడదని అంటూనే విద్య వైద్యం అందరికీ ఉచితంగా అందించాలని, మిగతా పథకాలు ఎత్తేయొచ్చని చెప్పారు.
తనకు కూడా తెలంగాణలో రైతు బంధు పథకాన్ని అందించారన్నారు. మరి రైతు బంధు పథకాన్ని ఎందుకు తీసుకున్నారని అడగ్గా ప్రభుత్వం తనకు ఉచితంగా ఇచ్చింది కాబట్టి తాను తీసుకున్నానని గణేష్ తెలిపారు. ఉచిత పథకాలు వద్దనేది తన అభిప్రాయమన్నారు.
ఇక పవన్ కల్యాణ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. అయితే ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారనేది తాను చెప్పలేనన్నారు. మొత్తానికి ఈయన జగన్పై బహిరంగంగా అభిమానం వ్యక్తం చేయడం చర్చకు దారి తీసింది.