అమ్మాయిల‌కు అశ్లీల వీడియోలు చూపించిన టీచ‌ర్

విధాత: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. త‌ర‌గ‌తి గ‌దిలో పాఠాలు బోధించ‌కుండా, విద్యార్థినుల‌కు అశ్లీల వీడియోలు చూపించాడు. అమ్మాయిల‌ను తాక‌రాని చోట తాకి లైంగిక వేధింపుల‌కు గురి చేశాడు. ఈ ఘ‌ట‌న జార్ఖండ్‌లోని ప‌శ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. నోవ‌ముండి బ్లాక్‌లోని ఓ పాఠ‌శాల ఉపాధ్యాయుడు.. ఆరుగురు అమ్మాయిలు ఉన్న త‌ర‌గ‌తి గ‌దిలోకి వెళ్లాడు. ఇక వారికి త‌న మొబైల్‌లో ఉన్న అశ్లీల వీడియోల‌ను చూపించాడు. వారితో […]

అమ్మాయిల‌కు అశ్లీల వీడియోలు చూపించిన టీచ‌ర్

విధాత: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. త‌ర‌గ‌తి గ‌దిలో పాఠాలు బోధించ‌కుండా, విద్యార్థినుల‌కు అశ్లీల వీడియోలు చూపించాడు. అమ్మాయిల‌ను తాక‌రాని చోట తాకి లైంగిక వేధింపుల‌కు గురి చేశాడు. ఈ ఘ‌ట‌న జార్ఖండ్‌లోని ప‌శ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. నోవ‌ముండి బ్లాక్‌లోని ఓ పాఠ‌శాల ఉపాధ్యాయుడు.. ఆరుగురు అమ్మాయిలు ఉన్న త‌ర‌గ‌తి గ‌దిలోకి వెళ్లాడు. ఇక వారికి త‌న మొబైల్‌లో ఉన్న అశ్లీల వీడియోల‌ను చూపించాడు. వారితో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. ఈ విష‌యం బాధిత విద్యార్థినుల త‌ల్లిదండ్రుల‌కు తెలిసింది.

దీంతో పెద్ద ఎత్తున స్కూల్ వ‌ద్ద‌కు మ‌హిళ‌లు చేరుకున్నారు. ఉపాధ్యాయుడిని ప‌ట్టుకుని ఆయ‌న ముఖంపై ఇంక్ చ‌ల్లారు. తీవ్రంగా చిత‌క‌బాదారు. చెప్పుల దండ వేసి ఊరేగించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని, ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినుల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఉపాధ్యాయుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, త‌క్ష‌ణ‌మే జైలుకు పంపాల‌ని మ‌హిళ‌లు డిమాండ్ చేశారు.