King Cobras Dance | తరగతి గదిలో నాగుపాముల నాట్యం.. షాకైన విద్యార్థులు.. వీడియో
King Cobras Dance | నాగుపాము( King Cobra ).. ఈ పేరు వింటేనే గుండెల్లో దడ మొదలవుతుంది. పిల్లలు( Childrens ) అయితే భయపడి పరుగులు పెడుతారు. కానీ పిల్లల ముందే ఓ రెండు నాగుపాములు నాట్యమాడాయి( King Cobras Dance ). ఆ నాగుపాముల నృత్యాన్ని చూసి విద్యార్థులు( Students ) షాకయ్యారు.
 
                                    
            King Cobras Dance | మధ్యప్రదేశ్( Madhya Pradesh ) గ్వాలియర్ జిల్లాలోని బమరోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల( Govt School )లో ఓ రెండు నాగుపాములు( King Cobras ) ప్రత్యక్షమయ్యాయి. తరగతి గది( Class Room )లోకి ప్రవేశించిన ఆ రెండు పాములు అలజడిని సృష్టించాయి. నాగుపాములు ఒకదానికొకటి పెనవేసుకుని న్యాటమాడాయి( King Cobras Dance ). బుసలు కొడుతూ సయ్యాట ఆడిన ఆ కింగ్ కోబ్రాలను చూసి విద్యార్థులు( Students ) తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వెంటనే తమ ఉపాధ్యాయుడికి పిల్లలు సమాచారాన్ని చేరవేశారు. అప్రమత్తమైన టీచర్ విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా.. సురక్షితంగా ఓ గదిలో ఉంచాడు. ఆ తర్వాత అర గంటపాటు శ్రమించి ఆ రెండు నాగుపాములను బయటకు పంపించేశారు. ఆ తర్వాత టీచర్లు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. నాగుపాముల న్యాటానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బమరోల్ పాఠశాల చుట్టూ వరద నీరు నిలిచిపోయిందని టీచర్లు తెలిపారు. ఈ ప్రాంతమంతా చిత్తడిగా మారిన క్రమంలోనే పాములు సంచారం ఎక్కువైందని వాపోయారు. పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నామని, పాముల బెడద నుంచి తప్పించుకుంటున్నామని తెలిపారు.
#WATCH | Snakes Twirl, Swirl Inside Classroom Of Govt School in Gwalior #MPNews #MadhyaPradesh #viralvideo pic.twitter.com/UACapbcqS4
— Free Press Madhya Pradesh (@FreePressMP) October 29, 2025
 
                     X
                                    X
                                 Google News
                        Google News
                     Facebook
                        Facebook
                     Instagram
                        Instagram
                     Youtube
                        Youtube
                     Telegram
                        Telegram