ఐటీ ఉద్యోగాల పేరిట అమ్మాయిలకు వల.. ఆపై లైంగికదాడులు
Prasad | ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. నిరుద్యోగ అమ్మాయిలను టార్గెట్ చేశాడు. ఐటీ ఉద్యోగాల వేటలో ఉన్న యువతులకు సోషల్ మీడియా ద్వారా వల వేసేవాడు. ఆ తర్వాత వారిని వివిధ హాటల్స్‌కు రప్పించి, అత్యాచారం చేసేవాడు. అలా ఏకంగా 13 మంది మహిళలపై ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి లైంగికదాడులకు పాల్పడ్డాడు. ఓ యువతి ఫిర్యాదుతో ఈ టెకీ లీలలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఢిల్లీ ప్రసాద్(28) అనే యువకుడు వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ […]

Prasad | ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. నిరుద్యోగ అమ్మాయిలను టార్గెట్ చేశాడు. ఐటీ ఉద్యోగాల వేటలో ఉన్న యువతులకు సోషల్ మీడియా ద్వారా వల వేసేవాడు. ఆ తర్వాత వారిని వివిధ హాటల్స్‌కు రప్పించి, అత్యాచారం చేసేవాడు. అలా ఏకంగా 13 మంది మహిళలపై ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి లైంగికదాడులకు పాల్పడ్డాడు. ఓ యువతి ఫిర్యాదుతో ఈ టెకీ లీలలు వెలుగులోకి వచ్చాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఢిల్లీ ప్రసాద్(28) అనే యువకుడు వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అయితే ప్రసాద్‌కు అమ్మాయిలంటే చాలా మోజు. దీంతో ఐటీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతులను టార్గెట్ చేశాడు. ఇందుకోసం ఇన్‌స్టా గ్రాంలో అమ్మాయి పేరుతో మోనికా, మేనేజర్ అనే రెండు నకిలీ ఖాతాలను సృష్టించాడు. ఆ ఖాతాల ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకుని, ఐటీ రంగంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించేవాడు.
ఇక ఉద్యోగాల గురించి అమ్మాయిలకు వివరించేందుకు పలు హోటల్స్‌లో రూమ్స్ బుక్ చేసేవాడు. హోటల్‌కు యువతులు చేరుకున్న తర్వాత తన అసలు స్వరూపం బయటపెట్టేవాడు. ఒక పదిహేను నిమిషాల పాటు ఉద్యోగం గురించి, వివరించేవాడు. అనంతరం వారిపై చేయి వేసి లొంగదీసుకునేవాడు. రహస్యంగా కెమెరాలతో ఆ దృశ్యాలను చిత్రీకరించేవాడు. ఆ వీడియోలను అడ్డంగా పెట్టుకుని, ఇప్పటి వరకు 13 మంది అమ్మాయిలను మోసం చేశాడు. పలుమార్లు తన కోరికలను తీర్చుకున్నాడు.
ప్రసాద్ ఆగడాలను భరించలేని ఓ యువతి బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ప్రసాద్ ఆగడాలు వెలుగు చూశాయి. ప్రసాద్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గురువారం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాలేజ్ డేస్ నుంచే ఈ అలవాటు
ప్రసాద్ తన కాలేజ్ డేస్ నుంచే అమ్మాయిలను లైంగికంగా వేధించినట్లు పోలీసుల విచారణలో తేలింది. లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగాల పేరిట అమ్మాయిలను ఉపయోగించుకున్నట్లు తెలిసింది. అమ్మాయిలపై మోజుతోనే ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.