తెలంగాణ హైకోర్టు జ‌డ్జీల‌ బ‌దిలీ

తెలంగాణ హైకోర్టు చెందిన ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల‌ను బ‌దిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గ‌తంలో సిఫార్సు చేసింది.

తెలంగాణ హైకోర్టు జ‌డ్జీల‌ బ‌దిలీ

* జ‌స్టిస్ ఎం.ల‌క్ష్మ‌ణ్‌ రాజ‌స్థాన్ హైకోర్టుకు

* జ‌స్టిస్ అనుప‌మ చ‌క్ర‌వ‌ర్తి పాట్న హైకోర్టుకు

* ఉత్త‌ర్వులు జారీ చేసిన రాష్ర్ట‌ప‌తి ద్రౌప‌దిముర్ము

విధాత‌, హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టు చెందిన ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల‌ను బ‌దిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గ‌తంలో సిఫార్సు చేసింది. అయితే సుప్రీంకోర్టు కొలీజియం గ‌తంలో చేసిన బ‌దిలీ సిఫార్సుకు బుధ‌వారం రాష్ర్ట‌ప‌తి ద్రౌప‌దిముర్ము ఆమోద‌ముద్ర వేశారు. దీంతో తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎం.ల‌క్ష్మ‌ణ్‌ను రాజ‌స్థాన్ హైకోర్టుకు, జ‌స్టిస్ అనుప‌మ చ‌క్ర‌వ‌ర్తిని పాట్న హైకోర్టుకు బ‌దిలీచేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

అయితే తెలంగాణ హైకోర్టునుంచి మొత్తం న‌లుగురు న్యాయ‌మూర్తుల‌ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయ‌గా ఇందులో జ‌స్టిస్ ఎం.ల‌క్ష్మ‌ణ్, జ‌స్టిస్ అనుప‌మ చ‌క్ర‌వర్తిని బ‌దిలీ చేస్తూ ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. కానీ జ‌స్టిస్ సుమ‌ల‌త‌, జ‌స్టిస్ సుధీర్‌కుమార్ నాయుడు బ‌దిలీలు ఇంకా కేంద్రం వ‌ద్ద పెండింగ్‌లో ఉన్నాయి. త్వ‌ర‌లోనే వీరి బ‌దిలీల‌కు కూడా రాష్ర్ట‌ప‌తి నుంచి ఉత్త‌ర్వులు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ద‌ని స‌మాచారం.