Naatu Naatu song | ‘నాటు నాటు’ సాంగ్‌తో దద్దరిల్లిన టెస్లా ప్లాంట్‌

Naatu Naatu song | ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని ‘నాటు నాటు’ ప్రపంచవ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్నది. ఇటీవల బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డును సైతం అందుకున్నది. వేదికపై సైతం పాట లైవ్‌ ప్రదర్శన జరిగింది. ఆస్కార్ అవార్డుతో తెలుగు పాటకు మరింత క్రేజ్‌ వచ్చింది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు సైతం నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. దక్షిణ కొరియా, జర్మనీ ఎంబసీల సిబ్బంది సైతం ఢిల్లీలో పాటకు కాళ్లు కదిపారు. […]

Naatu Naatu song | ‘నాటు నాటు’ సాంగ్‌తో దద్దరిల్లిన టెస్లా ప్లాంట్‌

Naatu Naatu song | ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని ‘నాటు నాటు’ ప్రపంచవ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్నది. ఇటీవల బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డును సైతం అందుకున్నది. వేదికపై సైతం పాట లైవ్‌ ప్రదర్శన జరిగింది.

ఆస్కార్ అవార్డుతో తెలుగు పాటకు మరింత క్రేజ్‌ వచ్చింది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు సైతం నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. దక్షిణ కొరియా, జర్మనీ ఎంబసీల సిబ్బంది సైతం ఢిల్లీలో పాటకు కాళ్లు కదిపారు.

ఇక తాజాగా అమెరికా న్యూజెర్సీలోని టెస్లా ప్లాంట్‌ సైతం ‘నాటు నాటు’ సాంగ్‌తో మోత మోగింది. పాటకు తగ్గట్టుగా లైటింగ్ చేస్తూ పాటను సెలబ్రేట్ చేశారు. పాట మ్యూజిక్‌ తగినట్లుగా లైటింగ్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే పాటకు టెస్లా సిబ్బంది కూడా కాలు కదిపారు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీన్ని చూసిన నెజిటన్లు హర్షం వ్యక్తం చేస్తూ.. తెలుగు పాట సత్తా ఇది అంటూ కామెంట్లు పెడుతున్నారు.