Congress | కాంగ్రెస్‌లో చేరే వారు వీరే.. జాబితా విడుదల
Congress | విధాత: కర్ణాటకలో కాంగ్రెస్ విజయం బానే పని చేస్తోంది. తెలంగాణాలో పూర్తిగా ఎండిపోతుంది అనుకున్న ఆ పార్టీ ఇప్పుడు మెల్లగా పుంజుకుంటోంది. కర్ణాటక గెలుపు తెలంగాణాలో సైతం పార్టీకి ఊపిరిపోసింది. ఇప్పుడు తెలంగాణాలో బీజేపీలో జోరు తగ్గి నీరసపడిపోగా అటు కాంగ్రెస్ లో జోరు పెరిగింది. బీజేపీలో.. బీఆర్ఎస్ లో సరిగ్గా కుదురుకోలేక ఇబ్బంది పడుతున్న నాయకులూ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు లైన్ కడుతున్నారు. ఆ జాబితాలో కాస్త దమ్మున్న జూపల్లి కృష్ణారావు, […]

Congress |
విధాత: కర్ణాటకలో కాంగ్రెస్ విజయం బానే పని చేస్తోంది. తెలంగాణాలో పూర్తిగా ఎండిపోతుంది అనుకున్న ఆ పార్టీ ఇప్పుడు మెల్లగా పుంజుకుంటోంది. కర్ణాటక గెలుపు తెలంగాణాలో సైతం పార్టీకి ఊపిరిపోసింది. ఇప్పుడు తెలంగాణాలో బీజేపీలో జోరు తగ్గి నీరసపడిపోగా అటు కాంగ్రెస్ లో జోరు పెరిగింది.
బీజేపీలో.. బీఆర్ఎస్ లో సరిగ్గా కుదురుకోలేక ఇబ్బంది పడుతున్న నాయకులూ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు లైన్ కడుతున్నారు. ఆ జాబితాలో కాస్త దమ్మున్న జూపల్లి కృష్ణారావు, ఖమ్మంలో పట్టున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా దాదాపు 35 మంది త్వరలో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు కాంగ్రెస్ ప్రకటిస్తోంది. ఈమేరకు ఒక జాబితాను విడుదల చేసారు.
ఇక ఈ జాబితాలో ఈటెల రాజేంద్ర లేరు .. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేరు కానీ ఈ ఇద్దరూ కాస్త టైం తీసుకుని అలోచించి కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయ్. మరోవైపు రాజేంద్ర దంపతులు రేపు విలేకరులతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయ్. అప్పుడు వారు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు అంటున్నారు.
ఇక తానూ ఖమ్మంలో దాదాపు ఐదు లక్షల మందితో బహిరంగ సభ పెట్టి తన సత్తా చూపుతాను అని పొంగులేటి శ్రీనివాస రెడ్డి గట్టిగా ప్రకటించారు. దీంతో ఇక కాంగ్రెస్ కు కాస్త బలం పుంజుకున్నట్లు భావిస్తున్నారు. ఖమ్మంలో కనీసాయిం ఐదారు సీట్లల్లో తన ప్రభావితం గట్టిగా చూపుతారని అంటున్నారు.
మొత్తానికి కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్ ను బలోపేతం చేస్తుండగా బిజెపిని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. బీజేపీలో గ్రూపుల గోల, క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తున్నాయి. కాంగ్రెస్ లో కూడా గ్రూపులు ఎక్కువే ఉన్నప్పటికీ ఇప్పటివరకూ ఐతే కొంత ఐక్యతతో ముందుకు సాగుతున్నారు.