మద్యం మత్తులో.. బస్సులో మహిళపై మూత్ర విసర్జన
Karnataka | ఇటీవలే ఓ విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన మరువక ముందే.. అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. బస్సులో గాఢ నిద్రలో ఉన్న ఓ మహిళపై ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్బళ్లి సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విజయపుర నుంచి మంగళూరుకు వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సులో రామప్ప(25) అనే ఇంజినీర్ గ్రాడ్యుయేట్ ప్రయాణిస్తున్నాడు. హుబ్బళ్లి సమీపంలోని కిరేసూరులోని ఓ దాబా […]

Karnataka | ఇటీవలే ఓ విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన మరువక ముందే.. అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. బస్సులో గాఢ నిద్రలో ఉన్న ఓ మహిళపై ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్బళ్లి సమీపంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. విజయపుర నుంచి మంగళూరుకు వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సులో రామప్ప(25) అనే ఇంజినీర్ గ్రాడ్యుయేట్ ప్రయాణిస్తున్నాడు. హుబ్బళ్లి సమీపంలోని కిరేసూరులోని ఓ దాబా వద్ద మంగళవారం రాత్రి బస్సు ఆగింది. దీంతో ప్రయాణికులందరూ టీ తాగేందుకు బస్సు దిగారు. రామప్ప మాత్రం బస్సులోనే ఉండిపోయాడు. బస్సు ముందు సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికురాలి వద్దకు రామప్ప చేరుకుని, ఆమెపై మూత్ర విసర్జన చేశాడు.
దీంతో ఆవిడ గట్టిగా కేకలు వేయడంతో.. డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు బస్సులోకి వచ్చారు. రామప్పను మందలించి బస్సు నుంచి కిందకు దించేశారు. ఓ ఇద్దరు ప్రయాణికులు అతనిపై చేయి కూడా చేసుకున్నారు. ఇక బాధిత మహిళ దాబాలోని స్నానాల గదిలో స్నానం చేసి, డ్రస్సు మార్చుకున్న అనంతరం బస్సు కదిలింది. అయితే రామప్ప మద్యం మత్తులో ఉన్నట్లు ప్రయాణికులు పేర్కొన్నారు.