Scorpions | తేలు విషపూరితమైనది. అది మనల్ని కుట్టిందంటే.. ప్రాణాలకు ముప్పే. తేలు కుట్టిన వెంటనే చికిత్స తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. అలాంటి విషపూరితమైన తేళ్లు.. ఓ ఇంట్లో వేల సంఖ్యలో ప్రత్యక్షమయ్యాయి. చీమల గుంపు మాదిరిగానే తేళ్లు దర్శనమిచ్చాయి. ఒకదానిపై ఒకటి పాకుతూ భయంకరంగా ఉన్నాయి. ఆ ఇంటి గోడలకు పాకుతున్న తేళ్లను చూస్తుంటే శరీరం గగుర్పాటుకు గురవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram […]
Scorpions | తేలు విషపూరితమైనది. అది మనల్ని కుట్టిందంటే.. ప్రాణాలకు ముప్పే. తేలు కుట్టిన వెంటనే చికిత్స తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. అలాంటి విషపూరితమైన తేళ్లు.. ఓ ఇంట్లో వేల సంఖ్యలో ప్రత్యక్షమయ్యాయి. చీమల గుంపు మాదిరిగానే తేళ్లు దర్శనమిచ్చాయి. ఒకదానిపై ఒకటి పాకుతూ భయంకరంగా ఉన్నాయి. ఆ ఇంటి గోడలకు పాకుతున్న తేళ్లను చూస్తుంటే శరీరం గగుర్పాటుకు గురవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అయితే ఈ తేళ్లు ఉన్న ప్రదేశం మాత్రం తెలియరాలేదు. వీడియో వినిపిస్తున్న వాయిస్ ఆధారంగా అది పోర్చుగీస్ అయి ఉంటుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. కొందరేమో బ్రెజిల్ అని తెలుపుతున్నారు. తేళ్లకు బ్రెజిల్ ఫేమస్ అని పేర్కొంటున్నారు. గతేడాది కూడా ఈ వీడియోను రెడ్డిట్ పోస్టు చేసిందని మరొకరు గుర్తు చేశారు.
Viral Video | ఓ ఇంట్లో వేల సంఖ్యలో తేళ్లు.. https://t.co/yoIIWOhkoL pic.twitter.com/H7zRoD2bL0
— vidhaathanews (@vidhaathanews) December 12, 2022
అవి అత్యంత ప్రమాదకరమైన డెత్ స్టాకర్ తేళ్లని తెలుస్తోంది. ఈ తేళ్ల విషం ఎంతో ఖరీదైనది. ఒక్కో లీటరు 10.5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 86 కోట్ల 76 లక్షలు పలుకుతుంది. కానీ ఒక్క లీటరు కావాలంటే ఒక్కో తేలు నుంచి దాదాపు 7లక్షల సార్లు విషం తీయాల్సి ఉంటుంది.