జింకలను పట్టించుకోని పెద్ద పులి.. వీడియో వైరల్
విధాత: దట్టమైన అడవుల్లో అన్ని రకాల జంతువులు నివసిస్తుంటాయి. పెద్ద పులులు, సింహాలకు మిగతా జంతువులు భయపడి పారిపోతుంటాయి. ఆ జంతువులను భక్షించేందుకు పులులు, సింహాలు వేటాడుతుంటాయి. అయితే ఓ రెండు జింకలు పులికి సమీపంలోనే ఉన్నప్పటికీ.. వాటికి ఆ పెద్ద పులి ఎలాంటి హానీ చేయలేదు. తన దారిన తాను వెళ్లిపోయింది పెద్ద పులి. రెండు జింకలు హమ్మయ్యా అంటూ చెట్ల పొదల్లోకి పరుగెత్తాయి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ రమేశ్ పాండే […]

విధాత: దట్టమైన అడవుల్లో అన్ని రకాల జంతువులు నివసిస్తుంటాయి. పెద్ద పులులు, సింహాలకు మిగతా జంతువులు భయపడి పారిపోతుంటాయి. ఆ జంతువులను భక్షించేందుకు పులులు, సింహాలు వేటాడుతుంటాయి. అయితే ఓ రెండు జింకలు పులికి సమీపంలోనే ఉన్నప్పటికీ.. వాటికి ఆ పెద్ద పులి ఎలాంటి హానీ చేయలేదు. తన దారిన తాను వెళ్లిపోయింది పెద్ద పులి. రెండు జింకలు హమ్మయ్యా అంటూ చెట్ల పొదల్లోకి పరుగెత్తాయి.
ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ రమేశ్ పాండే తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. పులులు తమకు ఆకలిగా ఉన్నప్పుడే జంతువులను వేటాడుతాయి. ఊరికే ఏ జంతువును కూడా పులి చంపదు అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 1.4 లక్షల మంది వీక్షించగా, 2,800 మంది లైక్ చేశారు.