హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ఇరుక్కున్న టిప్ప‌ర్

విధాత: హైద‌రాబాద్ హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో భారీ ప్ర‌మాదం జ‌రిగింది. స్ట్రీట్ నంబ‌ర్ 5లో రోడ్డు కుంగిపోయింది. దీంతో ఆ రోడ్డుపై వెళ్తున్న టిప్ప‌ర్ కుంగిపోయిన రోడ్డులో ఇరుక్కుపోయింది. ఈ ప్ర‌మాదంలో టిప్ప‌ర్ డ్రైవ‌ర్‌తో పాటు ఇద్ద‌రు కూలీలు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. ఆ దారిలో వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నిలిపివేశారు. దీంతో ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ట్రాఫిక్‌ను క్ర‌మ‌బ‌ద్దీ క‌రించేందుకు పోలీసులు తీవ్రంగా శ్ర‌మించాల్సి ఉంది. ప్ర‌ధాన ర‌హ‌దారి […]

  • By: krs    latest    Jan 28, 2023 1:16 PM IST
హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ఇరుక్కున్న టిప్ప‌ర్

విధాత: హైద‌రాబాద్ హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో భారీ ప్ర‌మాదం జ‌రిగింది. స్ట్రీట్ నంబ‌ర్ 5లో రోడ్డు కుంగిపోయింది. దీంతో ఆ రోడ్డుపై వెళ్తున్న టిప్ప‌ర్ కుంగిపోయిన రోడ్డులో ఇరుక్కుపోయింది. ఈ ప్ర‌మాదంలో టిప్ప‌ర్ డ్రైవ‌ర్‌తో పాటు ఇద్ద‌రు కూలీలు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. ఆ దారిలో వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నిలిపివేశారు. దీంతో ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ట్రాఫిక్‌ను క్ర‌మ‌బ‌ద్దీ క‌రించేందుకు పోలీసులు తీవ్రంగా శ్ర‌మించాల్సి ఉంది.

ప్ర‌ధాన ర‌హ‌దారి కుంగిపోవ‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. క్రేన్ సాయంతో టిప్ప‌ర్‌ను తొల‌గించారు. కొద్ది రోజుల క్రితం గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని చక్నావాడి ఏరియాలో ప్ర‌ధాన ర‌హ‌దారి కుంగిపోయిన సంగ‌తి తెలిసిందే. నాలా ప‌క్క‌నే ఉన్న రోడ్డు కుంగిపోవ‌డంతో అధికారులు వేగంగా మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టారు. ఈ ప్ర‌మాదంలో పలువురు గాయ‌ప‌డిన విష‌యం విదిత‌మే.