Tipu Sultan | విధాత: టిప్పు సుల్తాన్ పడక గదిలో లభించిన సుఖేలా ఖడ్గం వేలంలో రికార్డు ధర పలికింది. బంగారు తీగలు పొదిగిన పిడితో ఉన్న ఈ ఉక్కు ఖడ్గం యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణానంతరం ఆయన పడక గదిలో లభించింది. ఈ ఖడ్గం ఇంత ధర పలుకుతుందని తాము ఊహించలేదని ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ట్ వేలంపాట సంస్థ బాన్హామ్స్ అధిపతి ఆలివర్ వైట్ చెప్పారు. ఈ ఖడ్గం వేలం పాటలో 142 కోట్ల […]
Tipu Sultan |
విధాత: టిప్పు సుల్తాన్ పడక గదిలో లభించిన సుఖేలా ఖడ్గం వేలంలో రికార్డు ధర పలికింది. బంగారు తీగలు పొదిగిన పిడితో ఉన్న ఈ ఉక్కు ఖడ్గం యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణానంతరం ఆయన పడక గదిలో లభించింది.
ఈ ఖడ్గం ఇంత ధర పలుకుతుందని తాము ఊహించలేదని ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ట్ వేలంపాట సంస్థ బాన్హామ్స్ అధిపతి ఆలివర్ వైట్ చెప్పారు. ఈ ఖడ్గం వేలం పాటలో 142 కోట్ల రూపాయల ధరకు అమ్ముడుపోయింది.
టిప్పు వద్ద ఉన్న ఆయుధాలలో ఇది చాలా అమూల్యమైనదని వేలం పాట సంస్థ పేర్కొంది. టిప్పు సుల్తాన్ 1782-99ల మధ్య మైసూరును పరిపాలించారు. టైగర్ ఆఫ్ మైసూర్‌గా పేరుగాంచిన టిప్పు సుల్తాన్‌పై విజయం సాధించినందుకు మేజర్ జనరల్ డేవిడ్ బైర్డ్‌కు ఈస్ట్ ఇండియా ఆర్మీ ఈ ఖడ్గాన్ని బహూకరించింది.