Site icon vidhaatha

Tomatoes | రూ. 21 ల‌క్ష‌ల విలువైన టమాటాలు మాయం.. కేసు న‌మోదు

Tomatoes |

ట‌మాటా ధ‌ర‌లు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కిలో రూ. 180 ప‌లికిన ట‌మాటా ధ‌ర‌.. ప్ర‌స్తుతం రూ. 200కు చేరింది. అయితే రూ. 21 ల‌క్ష‌ల విలువ చేసే ట‌మాటాలు మాయం అయ్యాయి. ట‌మాటా రైతు ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క‌లోని కోలార్‌కు చెందిన ఓ రైతు త‌న పొలంలో పండిన ట‌మాటాల‌ను రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌కు ఓ ట్ర‌క్కులో త‌ర‌లించాడు. అయితే ట్ర‌క్కు డ్రైవ‌ర్, మ‌రో వ్య‌క్తి క‌లిసి ట‌మాటాల‌ను మార్గ‌మ‌ధ్య‌లోనే మాయం చేశారు.

రూ. 21 ల‌క్ష‌ల విలువ చేసే ట‌మాటాలు మాయం కావ‌డంతో.. బాధిత రైతు కోలార్ న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ట‌మాటాల‌ను త‌రలించిన ట్ర‌క్కు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట‌మాటా ధ‌ర‌లు కొండెక్కిన నేప‌థ్యంలో వాటిని దొంగిలించేందుకు చాలా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతూనే ఉన్నాయి. రైతుల‌ను చంపి కూడా ట‌మాటాల‌ను దోచుకెళ్లిన ఘ‌ట‌న‌లు చూశాం. ఇటీవ‌లే క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్ జిల్లాలో రూ. 2.7 ల‌క్ష‌ల విలువ చేసే ట‌మాటాను దొంగిలించిన సంగ‌తి తెలిసిందే.

Exit mobile version