Niharika | పాపం నిహారిక.. అప్పుడే వైరాగ్యం

Niharika | జీవితం అన్నాకా ఒడిదుడుకులు సహజం, అంతలోనే ఆనందం, అంతలోనే వైరాగ్యం అసలు జీవితానికి అర్థం తెలీని మనుషులు చేసే పని ఇది. పాపం నిండా పాతికేళ్ళు దాటాయో లేదో ఆ అమ్మడు ఏం చేసినా వైరల్ అయిపోవడం, అటు వైవాహిక జీవితం దెబ్బతినడం, పోనీ కెరియర్ నిలుపుకుందామా అంటే సరైన గైడెన్స్ లేకపోవడం వెరసి తనే నలుగురికీ టార్గెట్ కావడం భరించలేక, పూర్తిగా కాకపోయినా ఓ మోస్తరుగా వైరాగ్యంలోకి దిగిపోయింది. లోకం నోటికి జడిసో […]

  • Publish Date - August 13, 2023 / 02:01 AM IST

Niharika |

జీవితం అన్నాకా ఒడిదుడుకులు సహజం, అంతలోనే ఆనందం, అంతలోనే వైరాగ్యం అసలు జీవితానికి అర్థం తెలీని మనుషులు చేసే పని ఇది. పాపం నిండా పాతికేళ్ళు దాటాయో లేదో ఆ అమ్మడు ఏం చేసినా వైరల్ అయిపోవడం, అటు వైవాహిక జీవితం దెబ్బతినడం, పోనీ కెరియర్ నిలుపుకుందామా అంటే సరైన గైడెన్స్ లేకపోవడం వెరసి తనే నలుగురికీ టార్గెట్ కావడం భరించలేక, పూర్తిగా కాకపోయినా ఓ మోస్తరుగా వైరాగ్యంలోకి దిగిపోయింది. లోకం నోటికి జడిసో ఏమో కాస్త దిగివచ్చింది. నిజానికి తప్పు నాదేం లేదని వాదించి నిలబడవచ్చు.. కానీ వైరాగ్యం రూట్ ఎంచుకుంది ఎందుకో.. విషయం ఏంటంటే..

మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్ళి రెండేళ్ళు గడవక మునుపే మూడునాళ్ళ ముచ్చటగా పెటాకులైంది. ఇక ఈ విషయంలో ఇద్దరూ అటు చైతన్య జొన్నలగడ్డ, ఇటు నిహారిక కొణిదెల ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలో తెలియజెప్పినా కూడా తప్పంతా నీదేనని, నీ దురుసుతనంతోనే విషయం ఇంతదాకా తెచ్చుకున్నావని నలుగురూ అంటుండటంతో నిహారిక పరిస్థితి దారుణంగా తయారైంది.

చిన్నతనం నుంచి తనకంటూ ప్రత్యేకతను, కెరియర్‌లో గుర్తింపును కోరుకున్న నిహారిక, మెగా ఇమేజ్‌కి కాస్త దూరంగానే ఉండి యాంకరింగ్, షోస్, కొన్ని సినిమాల్లోనూ నటించి.. తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే యాంకరింగ్ కలిసివచ్చినంత, యాక్టింగ్ కలిసిరాలేదు. కాకపోతే ఆమె చేసిన సినిమాలు మంచి టాక్‌తో నిలిచాయంతే. అయితే అక్కడితో ఆగిపోకుండా తన సత్తా చాటేందుకు ప్రొడక్షన్ హౌస్ కూడా మొదలుపెట్టింది.

ఇదంతా బాగానే ఉంది కానీ చైతన్య జొన్నలగడ్డతో ఏం అభిప్రాయభేధాలు వచ్చాయో ఏమోగానీ ఇద్దరూ విడిపోయారు. దీనికి అమ్మడి దురుసుతనమే కారణమనే మాటలూ వినిపిస్తున్నాయి. పబ్బులో పట్టుబడి కాస్త బద్నామ్ అయితే.. నటన వద్దన్నా వినకుండా ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సీరీస్‌లో చేయడం కూడా ఓ కారణం అయిందనేలా వార్తలు వినబడుతున్నాయి.

ఇక విడాకులై నెల కూడా కాక ముందే ఒకప్పటి చార్మింగ్ హీరో తరుణ్‌తో నిహారికకు వివాహమనే వార్తలూ జోరందుకున్నాయి. దీని మీద తరుణ్ కూడా తన సైడ్ నుంచి క్లారిటీ ఇచ్చాడు. ఆ విషయం అలా ఉంటే.. రీసెంట్‌గా నిహారిక పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.

జీవితంలో కొన్ని వలయాలు ఉంటాయని, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయని వాటిని కదిలించి ఆపాలని చూడకూడదని, అడ్డుపడకూడదనే అర్థంతో జీవితం మీద మంచి పట్టున్న మనిషిలా వైరాగ్యంగా మాట్లాడింది నిహారిక. లైఫ్ లో ఎదురవుతున్న మలుపుల్ని ఊహించే గుణం ఇంకా అబ్బనట్టుగా ఉంది, ఇప్పటి పరిస్థితులకు ఉక్కిరిబిక్కిరి అయిపోతూ సాగుతున్న నిహారిక లైఫ్ ఇంకా ఏ మలుపులు చూడనుందో మరి.

Latest News