Site icon vidhaatha

Ambedkar’s 125-ft statue:14న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. లక్ష‌ మందికి పైగా ప్రజల సమీకరణ

Ambedkar’s 125-ft statue

విధాత: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడగుల (Ambedkar’s 125-ft statue) భారీ విగ్రహానికి లక్ష‌ మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె గురువారం బీఆర్కే భవన్‌లో పలు శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఈ నెల 14న నిర్వహించనున్న 125 అడుగుల భారీ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దార్శనికత మేరకు ఏర్పాట్లు ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధాన వేదిక వద్ద బారికేడింగ్‌ ఏర్పాట్లు చేయాలని రోడ్డు, భవనాల శాఖ అధికారులకు సీఎస్ సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆవరణ వద్ద సుందరీకరణ, మొబైల్‌ టాయిలెట్లు తదితర ఏర్పాట్లు చేయాలని సీఎస్ జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో లక్ష మందికి పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ఆధికారులకు తెలిపారు. అగ్నిమాపక శాఖ వారికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని సీఎస్ తెలిపారు. వేసవి కాలం దృష్ట్యా త్రాగు నీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను కూడా సిద్దంగా ఉంచాలన్నారు.

అత్యవసర వైద్య సహాయం అందించేందుకు అంబులెన్స్‌లను కూడా సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. పార్కింగ్, ప్రాంగణం వద్ద ఇతర ఏర్పాట్లను, పటిష్టం చేయడానికి శుక్రవారం సంయుక్తంగా సందర్శించాలని, తగిన ఏర్పాట్లు చేయడానికి ఆర్‌&బీ R&B, పోలీస్, హెల్త్, సాంఘిక సంక్షేమ శాఖ, హైదరాబాద్ కలెక్టర్, ఇతర అధికారులను సీఎస్ ఆదేశించారు.

ఈ సమన్వయ సమావేశంలో డీజీపీ అంజనీ కుమార్, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, టీఆర్‌అండ్‌బీ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, HMWSSB ఎండీ దానకిషోర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, ఎస్‌సీడీడీ కమిషనర్‌ యోగితా రాణా, సీడీఎంఏ సత్యనారాయణ, R&B ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version