ఉత్తమ్.. ఇప్పటికే సన్యాసంలో ఉన్నాడు: MLA శానంపూడి చురకలు

విధాత, హుజూర్ నగర్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి 50 వేల ఓట్ల మెజార్టీకి ఒక్క ఓటు తక్కువ వచ్చిన రాజకీయ సన్యాసం చేస్తానని ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని, ఆయన కొత్తగా సన్యాసం చేయాల్సిన అవసరం లేదని గడ్డం పెంచుకొని ఇప్పటికే సన్యాసిగానే కొనసాగుతున్నడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎద్దేవా చేశారు. నేరడుచర్లలో విలేకరులతో మాట్లాడిన సైదిరెడ్డి తనపై ఉత్తమ్ చేస్తున్న విమర్శలపై మరోసారి ఫైర్ అయ్యారు. […]

  • Publish Date - January 5, 2023 / 03:54 AM IST

విధాత, హుజూర్ నగర్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి 50 వేల ఓట్ల మెజార్టీకి ఒక్క ఓటు తక్కువ వచ్చిన రాజకీయ సన్యాసం చేస్తానని ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని, ఆయన కొత్తగా సన్యాసం చేయాల్సిన అవసరం లేదని గడ్డం పెంచుకొని ఇప్పటికే సన్యాసిగానే కొనసాగుతున్నడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎద్దేవా చేశారు.

నేరడుచర్లలో విలేకరులతో మాట్లాడిన సైదిరెడ్డి తనపై ఉత్తమ్ చేస్తున్న విమర్శలపై మరోసారి ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ 50 వేల మెజారిటీ మాటేమో గానీ, మొత్తం 50 వేల ఓట్లు తెచ్చు కోవాలని సవాల్ చేశారు. రాజకీయ సన్యాసం చేస్తాననడం ఉత్తమ్‌కు కొత్తేమీ కాదని, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి చేయలేదని, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 50 వేల మెజారిటీ తగ్గితే సన్యాసం చేస్తానని చెప్పి, తదుపరి ఉప ఎన్నికల్లో 50 వేల మెజారిటీ రాకుంటే మరోసారి రాజకీయ సన్యాసం చేస్తానని చేయలేదన్నారు.

తరచుగా ఇలా రాజకీయ సన్యాసం చేస్తానని చెబుతూనే చేయకుండా సన్యాసంపై నమ్మకం పోయేలా చేయడం ఉత్తమకు పరిపాటిగా మారిందని వ్యంగ్యంగా విమర్శించారు. అయినా ఉత్తమ్ కొత్తగా సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన ఇప్పటికే గడ్డం పెంచి సన్యాసంలోనే కొనసాగుతున్నారంటూ చురకలేశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన ఎంపీగా 2019లో గెలిచిన ఎన్నికలే చివరి ఎన్నికలన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గం అభివృద్ధికి తాను నిరంతరం కృషి కృషి చేస్తుంటే, ఉత్తమ్ విమర్శలతో కాలం వెళ్లదీస్తున్నారని, ఉత్తం వ్యవహార శైలితో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తలదించుకుంటున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి గాడిద కాళ్ళయినా పట్టుకొని ప్రజల కోసం పని చేస్తానన్నారు.

Latest News