Vijay Devarakonda | నా ఖుషీ.. మీతో పంచుకునేందుకు కోటి రూపాయ‌లు ఇస్తున్నా! విజ‌య్ దేవ‌ర‌కొండ కామెంట్స్

Vijay Devarakonda: వ‌రుస ఫ్లాపుల‌తో ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఎట్ట‌కేల‌కి ఖుషి సినిమాతో మంచి హిట్ కొట్టారు. ఈ స‌క్సెస్‌ని చిత్ర యూనిట్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. మూవీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. సక్సెస్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ అద్భుతమైన ప్ర‌సంగం సాగించారు. ఖుషి మీద మీరు చూపిస్తున్న ప్రేమ చాలా సంతోషాన్ని ఇస్తుంది. అయితే కొంద‌రు మాత్రం ఖుషి మీద ఫేక్ బీఎంఎస్ రేటింగ్స్, ఫేక్ యూట్యూబ్ […]

  • Publish Date - September 5, 2023 / 03:55 AM IST

Vijay Devarakonda:

వ‌రుస ఫ్లాపుల‌తో ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఎట్ట‌కేల‌కి ఖుషి సినిమాతో మంచి హిట్ కొట్టారు. ఈ స‌క్సెస్‌ని చిత్ర యూనిట్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. మూవీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. సక్సెస్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ అద్భుతమైన ప్ర‌సంగం సాగించారు. ఖుషి మీద మీరు చూపిస్తున్న ప్రేమ చాలా సంతోషాన్ని ఇస్తుంది.

అయితే కొంద‌రు మాత్రం ఖుషి మీద ఫేక్ బీఎంఎస్ రేటింగ్స్, ఫేక్ యూట్యూబ్ వీడియోలు చేస్తుండ‌డం నేను చూశారు.. కొందరు డబ్బులు ఖర్చు చేస్తూ త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నారు. అయితే అవన్నీ దాటుకుని అభిమానులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ నెంబర్స్, సక్సెస్ అందుకున్నాం. మీ మొహ‌ల‌లో క‌నిపిస్తున్న ఆ సంతోషం నాకెంతో తృప్తిని క‌లిగించింద‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ అన్నారు.

ఖుషి సినిమాఇ మీరు అందిస్తున్న ప్రేమ చూస్తుంటే కృతజ్ఞతగా మీకు మేము చాలా చాలా చేయాలని అనిపిస్తోంది. ఖుషికి మీరిస్తున్న ఆదరణ చూస్తుంటే నేను ఒక మంచి సినిమా చేస్తే దానిని చూసేందుకు మీరంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నార‌ని అర్ధ‌మైంది.

నా గెలుపుని మీరు ఎంత‌గానో కోరుకుంటున్నారు. నా సినిమా ఫ్లాపైతే బాధ‌ప‌డుతున్నారు, హిట్ అయితే సంతోషిస్తున్నారు. ఇప్పటి నుంచి నేను నా ఫ్యామిలీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ మీ కోసం కూడా పనిచేస్తాను అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. మీ న‌వ్వులు చూస్తున్న‌ప్ప‌టికీ నాకు అంత తృప్తి లేదు, ఇంకేదో చేయాల‌ని ఉంది.

నా ఖుషి మీతో పంచుకునేందుకు నా ఖుషి సంపాదన నుంచి కోటి రూపాయలు నా ఫ్యామిలీ అయిన మీకు కూడా ఇస్తున్నాను అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ ఊహించ‌ని ప్ర‌క‌ట‌న చేశారు. త్వరలో వంద ఫ్యామిలీస్ ను సెలెక్ట్ చేసి ప్రతి ఫ్యామిలీకి లక్ష రూపాయల చెక్ నేను అందిస్తా అని అన్నారు..నా హ్యాపీనెస్ లాగే నా సంపాదన కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరంతా దేవర ఫ్యామిలీ.

నా సోషల్ మీడియాలో స్ప్రెడింగ్ ఖుషి అని ఒక ఫామ్ పెడతాను . నేను మీకు ఇచ్చే రెంట్స్, ఫీజు దేనికి హెల్ప్ అయినా నాకు సంతోషంగా ఉంటుంది అని ప్రకటించి విజయ్ దేవరకొండ మ‌రోసారి గొప్ప మనసు చాటుకున్నారు. గ‌తంలోను విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

Latest News