Site icon vidhaatha

Vikramaditya | కంగనా రనౌత్‌‌పై పోటీకి కాంగ్రెస్ నుంచి విక్ర‌మాదిత్య‌

సిమ్లా: బాలీవుడ్ న‌టి కంగనా రనౌత్ భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌ఫున హిమాచల్ ప్రదేశ్‌లో గల మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కంగనాకు పోటీగా కాంగ్రెస్ పార్టీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్‌ను పోటీకి దించింది. ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ ప్రకటించారు. ప్రతిభా సింగ్ కుమారుడే విక్రమాదిత్య సింగ్.

మండి ప్రజలు ఎల్లప్పుడూ తమతో ఉంటారని, ఈసారి కూడా ఉంటారని ప్రతిభా సింగ్ ధీమాతో ఉన్నారు. కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ పార్టీ గట్టి అభ్యర్థినే బరిలోకి దింపిందని చెప్పొచ్చు. మండి నుంచి కాంగ్రెస్ ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. కంగ‌నాను గెలిపించుకోవ‌డానికి బీజేపీ ఎలాంటి ఎత్తులు వేస్తుందో చూడాలి.

Exit mobile version