Abbas | 1996లో వచ్చిన ‘ప్రేమదేశం’ అనే సినిమాలో నటుడు అబ్బాస్ చేసిన నటన ఎంతోమందిని ఆకట్టుకుంది. చాక్లెట్ బాయ్‌గా తను ఎంతో మంది అమ్మాయిల హృదయాలను తన నటన ద్వారా కట్టిపడేశాడు. ఆ సినిమా తరువాత తన హెయిర్ స్టైల్ కూడా ఒకప్పుడు అబ్బాస్ కటింగ్ పేరిట ట్రెండింగ్ అయింది. ఆ తరువాత వచ్చిన ‘రాజహంస, రాజా, నీ ప్రేమకై, శ్వేతనాగు, నరసింహ, అనసూయ’ ఇలా దాదాపు 50 సినిమాల్లో అబ్బాస్ నటించాడు. ‘ప్రేమదేశం’ సినిమా […]
Abbas |
1996లో వచ్చిన ‘ప్రేమదేశం’ అనే సినిమాలో నటుడు అబ్బాస్ చేసిన నటన ఎంతోమందిని ఆకట్టుకుంది. చాక్లెట్ బాయ్‌గా తను ఎంతో మంది అమ్మాయిల హృదయాలను తన నటన ద్వారా కట్టిపడేశాడు. ఆ సినిమా తరువాత తన హెయిర్ స్టైల్ కూడా ఒకప్పుడు అబ్బాస్ కటింగ్ పేరిట ట్రెండింగ్ అయింది. ఆ తరువాత వచ్చిన ‘రాజహంస, రాజా, నీ ప్రేమకై, శ్వేతనాగు, నరసింహ, అనసూయ’ ఇలా దాదాపు 50 సినిమాల్లో అబ్బాస్ నటించాడు. ‘ప్రేమదేశం’ సినిమా సెన్సేషనల్ హిట్ అవడంతో అప్పట్లో తనకు వచ్జిన స్టార్డమ్ అంతా ఇంతా కాదు.
కొన్నేళ్ల తరువాత ఏమయిందో కానీ 2015 నుండి తను సినిమాలకి కాస్త దూరంగా ఉంటూ న్యూజిలాండ్ వెళ్ళిపోయాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్న తరుణంలో కొన్నాళ్ళకు అక్కడే ఏదో కన్సట్రక్షన్ కంపెనీలో స్థిరపడిపోయాడు. అయితే ఇటీవలే చెన్నై వచ్చిన అబ్బాస్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇండస్ట్రీలో నటులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ను ఆ మధ్య స్టార్ట్ చేసారు. స్టార్ హీరోలు కూడా ఇందులో పాల్గొనడంతో మొదటి సీజన్ ప్రేక్షకులందరినీ ఎంతగానో అలరించింది. తాజాగా ఇంటర్వ్యూలో అబ్బాస్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో విశాల్ తన గురించి మాట్లాడిన మాటలకు బాగా హర్ట్ అయినట్లుగా చెప్పుకొచ్చాడు.
అబ్బాస్ విశాల్ గురించి మాట్లాడుతూ.. ‘‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రెండవ సీజన్లో నటుడు విశాల్ నా గురించి తప్పుగా మాట్లాడాడు. నాపై లేనిపోనివి చెప్పుకొచ్చాడు. ఆ వార్తలు అందరికీ తప్పుగా అర్థం అవడంతో.. ఇతరుల దృష్టి కూడా నాపై తప్పుగా మారింది. అతని బిహేవియర్ నాకు అసలు నచ్చలేదు. అలా చేయడం అసలు కరెక్ట్ కానే కాదు.
సినిమాల్లో ఉంటున్న మన మీద మనమే అలా దుష్ప్రచారం చేయడం కలిసికట్టుగా ఉండే ఇండస్ట్రీకి కూడా మచ్చ తెచ్చిపెడుతుంది. అలా అని విశాల్ పైన నాకు పగ కూడా లేదు, కొంత కోపం మాత్రమే ఉండేది. తన బిహేవియర్ నేను తీసుకోలేకపోయాను. అలాంటి వాతావరణంలో ఉండడం నాకు అసలే నచ్చదు. అందుకే నేనే వెనక్కి తగ్గాను. కానీ ఆ రోజుని మాత్రం ఎప్పటికీ మరచిపోలేను, నేను చాలా బాధ పడ్డాను.
అలాగని విశాల్‌తో పూర్తిగా మాట్లాడకుండా దూరం ఉండను. ముందు లాగా కలిసిపోయి స్నేహం చేయలేను అంతే. ఆ విషయం గురించి తరువాత విశాల్ కూడా బాధపడి ఉంటాడు అని అనుకుంటున్నాను’’ అంటూ అబ్బాస్ తన బాధని వ్యక్తపరిచారు. సో.. చూస్తుంటే అబ్బాస్ ఇండస్ట్రీ వదిలి వెళ్లడానికి విశాల్ మాటలే కారణమా? అనేలా ఇప్పుడంతా మాట్లాడుకుంటుండటం గమనార్హం.