Viswak | ఇటీవల సినిమా ప్రచార కార్యక్రమాలు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేందుకు విచిత్ర ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో హీరో హీరోయిన్స్ స్టేజ్‌ల మీద డ్యాన్స్‌లు చేయడం చాలా తక్కువ. కాని ఇప్పుడు స్టార్ హీరోలు సైతం కలు కదుపుతూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. డ్యాన్స్ చేస్తే పర్వాలేదు కానీ హీరోయిన్స్‌తో నానా రచ్చ చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. రీసెంట్గా జరిగిన ఖుషి మ్యూజికల్ ఈవెంట్లో స్టేజ్ పైన విజయ్ దేవరకొండ షర్ట్ […]
Viswak |
ఇటీవల సినిమా ప్రచార కార్యక్రమాలు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేందుకు విచిత్ర ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో హీరో హీరోయిన్స్ స్టేజ్‌ల మీద డ్యాన్స్‌లు చేయడం చాలా తక్కువ. కాని ఇప్పుడు స్టార్ హీరోలు సైతం కలు కదుపుతూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. డ్యాన్స్ చేస్తే పర్వాలేదు కానీ హీరోయిన్స్‌తో నానా రచ్చ చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు.
రీసెంట్గా జరిగిన ఖుషి మ్యూజికల్ ఈవెంట్లో స్టేజ్ పైన విజయ్ దేవరకొండ షర్ట్ తీసేసి సమంతతో డ్యాన్స్ చేయడం మనం చూశాం. ఆమెని ఎత్తుకొని గాల్లో తిప్పడం, ఇద్దరు ఒకరి కళ్లల్లో ఒకరు చూసుకోవ డం అందరిని ఆశ్చర్య పరచింది. దీనిపై కొంత ట్రోలింగ్ కూడా నడిచింది.. ఇక ఇప్పుడు ఇదే స్టైల్లో విశ్వక్, నేహా శెట్టి చేసి ఔరా అనిపించారు.
అగ్రెసివ్నెస్తో మాస్ కా దాస్ అనిపించుకున్న యువ హీరో విశ్వక్ సేన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి కథానాయికగా నటిస్తుంది.
మరి కొద్ది రోజులలో ఈ చిత్రం విడుదల కానుండగా, మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇటీవల సుట్టమ్ లా సూసి అనే సాంగ్ విడుదల చేయగా, ఇందులో విశ్వక్ సేన్, నేహా శెట్టి రొమాన్స్ తో రెచ్చి పోయారు. ఏకంగా లిప్ లాక్స్ తో కుర్రాళ్ళకి పసందైన విందు వడ్డించి నోరెళ్లపెట్టేలా చేశారు.
సాంగ్ లో విశ్వక్ సేన్.. నేహా శెట్టి చీర లాగుతూ డ్యాన్స్ చేయడం అందరిని ఆకర్షించింది. ఇప్పుడు అదే సాంగ్‌కి స్టేజ్‌పై డ్యాన్స్ చేసి షాక్ అయ్యేలా చేశారు. సాంగ్ తరహాలోనే నేహా శెట్టి తన చీర కొంగుతూ విశ్వక్ సేన్ ని చుట్టేసి.. ఇక బీట్ మొదలు కాగానే ఆమె కొంగుని లాగుతూ ఇద్దరూ డ్యాన్స్ చేయడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.
పబ్లిసిటీ కోసం నేహ ఇలా ఏమాత్రం బెదురూ లేకుండా చీర కొంగు తీసేసి వేదికపైనే డ్యాన్స్ చేయడం షాకింగ్‌గా ఉందని అంటున్నారు. ఏది ఏమైన ఇటీవలి కాలంలో ప్రమోషన్ స్టంట్స్ పీక్స్ కి వెళుతున్నాయని చెబుతున్నారు.