VK Naresh | నా మూడో భార్యతో ప్రాణహాని ఉంది.. తుపాకీ లైసెన్స్ ఇవ్వండి: నరేశ్
VK Naresh విధాత: ‘అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ’ అనే సామెత గుర్తుకు వస్తుంది అతని వ్యవహారం చూస్తే.. రోజుకో రాద్దాంతం చేస్తూ సంసారంలోని తగాదాలను, మార్కెట్‌లో సినిమా తీసి అమ్మేసే రకం. ఇంకా అతనెవరో పేరు చెప్పాలా.. అతగాడే నటి విజయనిర్మల కొడుకు నరేష్. పెళ్ళి మీద పెళ్ళి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కని, ముగ్గరు భార్యల్ని వదిలేసి ఇప్పుడు నాలుగో పెళ్ళికి సిద్ధమయ్యాడు నరేష్. ఈ నాలుగో పెళ్ళి చుట్టూనే గత […]

VK Naresh
విధాత: ‘అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ’ అనే సామెత గుర్తుకు వస్తుంది అతని వ్యవహారం చూస్తే.. రోజుకో రాద్దాంతం చేస్తూ సంసారంలోని తగాదాలను, మార్కెట్‌లో సినిమా తీసి అమ్మేసే రకం. ఇంకా అతనెవరో పేరు చెప్పాలా.. అతగాడే నటి విజయనిర్మల కొడుకు నరేష్.
పెళ్ళి మీద పెళ్ళి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కని, ముగ్గరు భార్యల్ని వదిలేసి ఇప్పుడు నాలుగో పెళ్ళికి సిద్ధమయ్యాడు నరేష్. ఈ నాలుగో పెళ్ళి చుట్టూనే గత కొంత కాలంగా నెట్టింట రచ్చ జరుగుతుంది. ఇక ఇతని విషయంలో ఏ వార్త వచ్చినా అది సోషల్ మీడియాలో సెన్సేషనలే.
ఆమధ్య వచ్చిన సినిమా ‘మళ్ళీ పెళ్లి’ కథంతా తన జీవితంలోంచి తెచ్చి సినిమాగా కుమ్మరించేశాడు నరేష్. పైపెచ్చు ఈ సినిమా కథంతా తన మూడో భార్య మీద ఉన్న కసి, కోపం, కక్ష తప్పితే సినిమాలో మరేం లేకుండా తీశాడు. ఇంటి గుట్టు రోడ్డున పడేసుకుని, కాలర్ ఎగరేసుకుంటూ తిరిగాడు.
ఇతగాడి చేష్టలు అర్థంకాక తికమక పడ్డారు జనం. ఇక భర్తను ఇద్దరు బిడ్డల్ని వదిలి నరేష్‌తో మూడో పెళ్ళికి రెడీ అయింది పవిత్రా లోకేష్. ఇక నరేశ్ మూడో భార్య రమ్యా రఘపతి మాత్రం ఏది ఏమైనా సరే నేను విడాకులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పేసింది.
ఇదంతా అలా ఉంటే.. తాజాగా నాకు నా మూడో భార్యతో ప్రాణహాని ఉంది. నా ఫోన్ కూడా ట్యాప్ చేసింది. బ్లాక్ మెయిల్ చేస్తుంది. నన్ను చంపించేందుకు సుపారీలు ఇస్తూ.. ఫ్లాన్స్ గీస్తుందని చెప్పి.. తనకు తుపాకీ లైసెన్స్ కావాలని అర్జీ పెట్టుకున్నాడు నరేష్. భార్యతో నడుస్తున్న విభేదాల కారణంగా నరేష్ తుపాకీ లైసెన్స్ కోసం ఎస్పీ మాధవరెడ్డిని నరేష్ కలిసిన ఫోటోస్ వైరల్ అయిన విషయం తెలిసిందే.
భార్యతో నరేష్‌కి వచ్చిన విభేదాలను నాలుగు గోడల మధ్య గుట్టుగా.. లేకపోతే కోర్టులోనో తేల్చుకోవలసింది పోయి, కుటుంబానికి సంబంధించి ఏ విషయమైనా నెట్టింట కనిపించేట్టూ చేసుకుంటున్నాడు నరేష్. ఒక్కోసారి అతని చేష్టలు అనుమానాలను కూడా కలిగిస్తున్నాయి.
అతను, మూడో భార్య (రమ్య) కలిసే ఇదంతా చేస్తున్నారా? నరేష్‌ని నిత్యం వార్తలలో ఉండేలా చేయడా నికి, సినిమాలలో అవకాశాలు పుష్కలంగా రావడానికి ఇదంతా పక్కా స్కెచ్ రచించుకుని మరీ చేస్తున్నా రేమో అనేలా.. కొన్ని వర్గాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఏమో.. ఇప్పుడున్న సమాజంలో ఏమైనా జరగవచ్చు. ఫైనల్‌గా ఈ విపరీత ధోరణి అతన్ని ఎటు తీసుకుపోతుందో చూడాలి మరి.