Site icon vidhaatha

Puri Jagannath Temple | ప్రసిద్ధ పూరీ క్షేత్రంపై.. ప్రతి రోజూ జెండా ఎలా మారుస్తారో చూడండి

Puri Jagannath Temple |

విధాత‌: భాగ‌వ‌తుల‌కు స్వ‌ర్గ‌స‌మానం పూరీ క్షేత్రం. ఒడిశా వాసుల‌కు అన్నీ ఆ జ‌గ‌న్నాధుడే. పూరీ అంటే విచిత్రంగా ఉండే స్వామి వారి విగ్ర‌హాలు, భారీ ర‌థ‌యాత్ర ఇలా ప‌లు వింత‌లు విశేషాలు గుర్తొస్తాయి.

అలాంటి విచిత్రాల్లో ఒక‌టి పూరీ క్షేత్ర గోపురంపై ఉండే జెండా. రోజూ సాయంత్రం ముంద‌టి రోజు జెండా తీసేసి కొత్త దాన్ని ప్ర‌తిష్ఠించ‌డం ఇక్క‌డ సంప్ర‌దాయం.

ఇద్ద‌రు వ్య‌క్తులు చ‌కాచ‌కా ఏ యంత్రం, తాడు సాయం లేకుండా కేవ‌లం జ‌గ‌న్నాథునిపై న‌మ్మ‌కంతోనే అంత ఎత్తున్న గోపురంపైకి ఎక్కేస్తారు.

అక్క‌డ భారీ విష్ణుచక్రానికి క‌ట్టి ఉన్న జెండాను తీసివేసి.. కొత్త దాన్ని ఏర్పాటు చేస్తారు. 800 ఏళ్లుగా ఈ సంప్రదాయం నిరంత‌రాయంగా కొన‌సాగుతుండ‌టం విశేషం.

Exit mobile version