PATHAN: బికినీ కోసం వెళ్లిన వారికి నిరాశేనా..!

విధాత: పఠాన్ చిత్రంలోని బేషర‌మ్ పాట విషయంలో పలు వివాదాలు చోటుచేసుకున్నాయి. వాస్త‌వానికి ఈ చిత్రానికి మొద‌టి రోజు యూత్ ప్రేక్ష‌కులు ఈ బికినీ షో కోస‌మే వ‌చ్చార‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. కానీ థియేట‌ర్ల‌కు వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌ను షారుఖ్, ద‌ర్శ‌కుడు సిద్దార్ద్ ఆనంద్‌లు కుర్చీల నుంచి క‌ద‌ల‌కుండా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. ఇందులో హీరోయిన్గా నటించిన దీపికా పడుకొనే కాషాయం రంగు బికినీ ధరించడంపై హిందూ సంఘాలు, బిజెపి, విహెచ్ పి, శివ‌సేన వంటివి తీవ్ర […]

  • By: krs    latest    Jan 30, 2023 5:02 AM IST
PATHAN: బికినీ కోసం వెళ్లిన వారికి నిరాశేనా..!

విధాత: పఠాన్ చిత్రంలోని బేషర‌మ్ పాట విషయంలో పలు వివాదాలు చోటుచేసుకున్నాయి. వాస్త‌వానికి ఈ చిత్రానికి మొద‌టి రోజు యూత్ ప్రేక్ష‌కులు ఈ బికినీ షో కోస‌మే వ‌చ్చార‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. కానీ థియేట‌ర్ల‌కు వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌ను షారుఖ్, ద‌ర్శ‌కుడు సిద్దార్ద్ ఆనంద్‌లు కుర్చీల నుంచి క‌ద‌ల‌కుండా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

ఇందులో హీరోయిన్గా నటించిన దీపికా పడుకొనే కాషాయం రంగు బికినీ ధరించడంపై హిందూ సంఘాలు, బిజెపి, విహెచ్ పి, శివ‌సేన వంటివి తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అంతేకాకుండా ఆ సినిమాలో దీపిక ప్రైవేటు పార్టుల‌పై షారుఖ్ చేతులు వేస్తున్నట్టు చూపించిన సీన్స్ కొందరికి ఆగ్రహాన్ని కలిగించాయి.

ఒక స్టార్ హీరోయిన్ అందునా పెళ్లయిన ఆమె ఇలా బికినీ వేసుకోవడం ఏమిటని విమర్శలు వచ్చాయి. దీంతో ఒక బాలీవుడ్ సీనియర్ నటుడు ముందు ముందు బికినీలు కూడా లేకుండా నటిస్తారేమో అంటూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ముసలోడికి దసరా పండగ అంటే ఇదే!

ఈ మధ్యకాలంలో ఒక హీరోయిన్ బికినీ గురించి ఇంతగా చర్చ ఎప్పుడూ జరగలేదు. గతంలో ఎంతోమంది బికినీలు వేశారు. కానీ కాషాయం రంగు బికినీ వేయడంతో ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. ఈ చిత్రంలో ఆమె పాకిస్తాన్ యువతిగా కనిపించింది.

ఇక ఈ బికినీకి సినిమాలో చాలా సెన్సార్ క‌ట్స్ ప‌డ్డాయి. బికినీకి మాత్రమే కాకుండా ఆమె పాత్రలో చాలా సీన్ల‌ను ఫైనల్లో ఎడిట్ చేసి లేపేశారు. దీంతో దీపిక అందాలని చూడాలని ఆశ పడి దియేటర్లకు వెళ్లిన వారికి ముఖ్యంగా బికినీ షో చేసిన దీపికాను చూసేందుకు పఠాన్ సినిమాకు వెళ్లిన వారికి నిరాశే మిగిలిందని చెప్పాలి.

పాటలో ట్రైలర్‌లో చూపించినట్టుగా దీపిక క్లోజ్ బికినీ అందాలు సినిమాలో లేవంటూ ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ కలిసి కనిపించిన సన్నివేశాలు దీపిక బికినీ షో కంటే కనువిందుగా ఉన్నాయి అనేది మరికొందరి మాట. మొత్తానికి పఠాన్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. మంచి ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. బాలీవుడ్కు చాలాకాలం తర్వాత ఒక సాలిడ్ సక్సెస్ పడిందనే టాక్ వినిపిస్తోంది.

Stills from the song ‘Besharam Rang’ in the movie Pathan. File Photo