West Indies: ఘోరమైన అవమానం.. పసికూనల చేతిలోను ఓడి వరల్డ్ కప్ రేసు నుంచి విండీస్ ఔట్
West Indies: వెస్టిండీస్ జట్టు ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించింది. ఎందరో గొప్ప ఆటగాళ్లు ఈ టీమ్‌లో ఉండేవారు. అద్భుతమైన బౌలింగ్, టెక్నిక్‌గా బ్యాటింగ్ చేసే బ్యాటర్స్‌తో ఉన్న ఈ జట్టు ఎన్నో వరల్డ్ కప్‌లు కూడా సాధించింది. అయితే ఈ సారి కనీసం వరల్డ్ కప్‌కు కూడా అర్హత సాధించలేక విమర్శల పాలైంది. ఇప్పటి జట్టులో కూడా మంచి ఆటగాళ్లే ఉన్నప్పటికీ వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లలో వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకొని ఇంటి బాట పట్టింది. […]

West Indies: వెస్టిండీస్ జట్టు ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించింది. ఎందరో గొప్ప ఆటగాళ్లు ఈ టీమ్‌లో ఉండేవారు. అద్భుతమైన బౌలింగ్, టెక్నిక్‌గా బ్యాటింగ్ చేసే బ్యాటర్స్‌తో ఉన్న ఈ జట్టు ఎన్నో వరల్డ్ కప్‌లు కూడా సాధించింది. అయితే ఈ సారి కనీసం వరల్డ్ కప్‌కు కూడా అర్హత సాధించలేక విమర్శల పాలైంది. ఇప్పటి జట్టులో కూడా మంచి ఆటగాళ్లే ఉన్నప్పటికీ వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లలో వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకొని ఇంటి బాట పట్టింది. వెస్టిండీస్ క్వాలియర్స్‌లో జింబాబ్వే, నెదర్లాండ్స్ తో ఆడి రెండు టీంల చేతిలో చిత్తుగా ఓడింది. స్కాట్లాండ్ చేతిలో అయిన గెలిచి పరువు నిలబెట్టుకుంటుంది అనుకుంటే ఆ టీం చేతిలోనూ ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది. దీంతో 1975 సంవత్సరం తరువాత వెస్టిండీస్ జట్టు లేకుండా తొలిసారి వరల్డ్ కప్ జరగనుంది.
జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ అర్హత టోర్నీలో సూపర్ సిక్స్ మ్యాచ్ లో వెస్టిండీస్- స్కాట్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలతు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌట్ అయింది. ఎంతో మంది స్పెషలిస్ట్ ఆటగాళ్లతో కూడిన విండీస్ బ్యాటింగ్ లైనప్ స్కాట్లాండ్ బౌలర్లు దాటికి కుప్పకూలింది. అనంతరం, విండీస్ విధించిన 182 పరుగుల లక్ష్యాన్ని స్కాట్లాండ్ జట్టు 43.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి సత్తా చాటింది. అయితే ఇప్పుడు వెస్టిండీస్ నిష్క్రమించడంతో సూపర్ సిక్స్‌లో ఇప్పటికే చెరో గెలుపు సాధించిన జింబాబ్వే, శ్రీలంక జట్లకి టాప్-10లో నిలిచేందుకు రూట్ క్లియర్ అయింది అనే చెప్పాలి.
స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ ఆటగాళ్లు ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయకపోవడం విడ్డూరం. జేసన్ హోల్డర్ (45), రొమేరియో షెపర్డ్ (36), బ్రాండన్ కింగ్ (22), నికోలస్ పూరన్ (21) కాస్త పర్వాలేదనిపించడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. స్కాట్లాండ్ జట్టులో ఓపెనర్ మాథ్యూ క్రాస్ (74 నాటౌట్), బ్రాండన్ మాక్ములెన్ (69) అద్భుతంగా ఆడడంతో ఆ జట్టు సునాయాసంగా విజయం సాధించింది. వన్డే వరల్డ్ కప్ మొదలయ్యాక, ఇప్పటివరకు జరిగిన ప్రతి టోర్నీలోనూ వెస్టిండీస్ ఆడుతూ వచ్చింది. అంతేకాదు 1975, 1979లో జరిగిన వరల్డ్ కప్ టోర్నీల్లో కప్ కూడా అందుకుంది. కాని ఇప్పుడు ఆ జట్టు చిన్న జట్లపైనా గెలవలేక అత్యంత అప్రదిష్ఠ మూటగట్టుకుంది.