ఫోటో కెమెరాకు అమ్మవారి రూపంలో ప్రత్యేక అలంకరణ కెమెరాకు పంచామృతాలతో అభిషేకం కెమెరా విడిభాగాల పేర్లతో ప్రత్యేక అంగ పూజ, ఏకాదశ నామార్చనలు విధాత బ్యూరో, కరీంనగర్: అందరిలో ఒకరిగా కాకుండా కొందరు ప్రత్యేకంగా ఉంటారు. ప్రపంచ కెమెరా (Camera) దినోత్సవం సందర్బంగా కెమెరాకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి కెమెరాను అమ్మవారి రూపంలో అలంకరించి.. కెమెరా పరిభాషలో ఛాయా చిత్రయంత్ర దేవతా అంగపుజా, అర్చన, హోమం నిర్వహించారు. కెమెరా దేవత ప్రత్యేక పూజా విధానంను నిర్వహించి రాష్ట్రంలోనే […]
విధాత బ్యూరో, కరీంనగర్: అందరిలో ఒకరిగా కాకుండా కొందరు ప్రత్యేకంగా ఉంటారు. ప్రపంచ కెమెరా (Camera) దినోత్సవం సందర్బంగా కెమెరాకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి కెమెరాను అమ్మవారి రూపంలో అలంకరించి.. కెమెరా పరిభాషలో ఛాయా చిత్రయంత్ర దేవతా అంగపుజా, అర్చన, హోమం నిర్వహించారు.
కెమెరా దేవత ప్రత్యేక పూజా విధానంను నిర్వహించి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఫొటో గ్రాఫర్స్ ఎక్కడున్నారో తెలుసుకోవాలంటే జగిత్యాల జిల్లా ధర్మపురి కి వెళ్లాల్సిందే.
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ క్షేత్రంలో ప్రపంచ కెమెరా దినోత్సవం సందర్బంగా ధర్మపురి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో ప్రపంచ ఫోటో గ్రాఫర్ల సంక్షేమార్థం కెమెరాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కెమెరాకు పంచామృతాలతో అభిషేకం చేశారు.
అనంతరం కెమెరాను అమ్మవారిగా అలంకరించి సాధారణ పూజలతో పాటు కెమెరా పరిభాషలో అంగ పూజ, అర్చన, ధూప, దీప, నైవేద్యం, మంగళహారతి, హోమం, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చాయాచిత్ర యంత్ర దేవత పూజా విధానం ప్రత్యేకతను సంతరించుకున్నది.