Site icon vidhaatha

Yadadri Bhuvanagiri | పెళ్లిలోను సమ్మె స్వరం..! సమ్మె డిమాండ్ల ప్లకార్డు ప్ర‌ద‌ర్శ‌న‌

Yadadri Bhuvanagiri

విధాత: ఉద్యోగ క్రమబద్దీకరణ కోరుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కొనసాగిస్తున్న సమ్మె కొత్త పుంతలు తొక్కుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఓ జూనియర్ పంచాయతీ కార్యదర్శి తన పెళ్లిలో సైతం సమ్మె డిమాండ్ల ప్లకార్డును ప్రదర్శించడం అందర్నీ ఆకట్టుకుంది.

మండలంలోని పంతంగి గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ తన వివాహంలో సమ్మె డిమాండ్ తో కూడిన ప్లకార్డును భార్యతో, సహచర గ్రామపంచాయతీ కార్యదర్శులతో కలిసి పెళ్లి వేదిక మీదనే ప్రదర్శించారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అంతా సమ్మె డిమాండ్లతో కూడిన ప్లకార్డులతోనే పెళ్లి వేడుకకు హాజరై తమ నిరసన తెలిపడం విశేషం.

కాగా జూనియర్, ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు కొనసాగిస్తున్న సమ్మెకు రోజురోజుకు పలు పార్టీల, ప్రజాసంఘాల మద్దతు పెరుగుతుంది. సూర్యాపేటలో తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు సంఘీభావం తెలిపి, వంటావార్పులో పాల్గొన్నారు. నల్లగొండ కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న సమ్మెలో బిజెపి జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు.

Exit mobile version