కాంగ్రెస్‌లోకి మరో వైసీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో వైసీపీ నుంచి మరో సిటింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరారు

కాంగ్రెస్‌లోకి మరో వైసీపీ ఎమ్మెల్యే

షర్మిల సమక్షంలో చేరిక

విధాత : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో వైసీపీ నుంచి మరో సిటింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు కొండేటి చిట్టిబాబు వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ముద్దనూరులో పీసీసీ చీఫ్ వైఎస్‌.షర్మిల సమక్షంలో కాంగెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని నమ్ముతూ అధికార తాను కాంగ్రెస్‌లో చేరినట్లుగా చిట్టిబాబు తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పి.గన్నవరం టిక్కెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టిబాబును కాదని విప్పర్తి వేణుగోపాల్‌కు సీఎం జగన్ కేటాయించారు. దీంతో అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే చిట్టిబాబు.. శనివారం పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆ వెంటనే ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.