Your Stool Says About Your Health | ప్రతి ఒక్కరూ ప్రతి రోజు మలవిసర్జన( Stool ) చేస్తూనే ఉంటారు. మలవిసర్జన చేసినప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మన మలం.. మన జీర్ణక్రియ వ్యవస్థ సరిగ్గా ఉందా..? లేదా..? ఆరోగ్యంగా ఉన్నామా..? లేదా..? అనే విషయాన్ని కూడా నిర్ధారిస్తుంది. మీ మలం రంగు( Stool Colour ).. మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుందని ఎయిమ్స్ డాక్టర్ సౌరభ్ సేథి( Doctor Saurabh Sethi ) చెబుతున్నారు. మలం ఏ రంగులో ఉంటే.. ఏ ఆరోగ్య సమస్య వస్తుందో ఆయన స్పష్టంగా వివరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సౌరభ్ సేథి మాట్లాడుతూ.. చాలా మంది తమ మలం మీద దృష్టి సారించరు. కానీ మలం మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే జీర్ణవ్యవస్థ నుంచి విసర్జితమయ్యే మలం.. మీ ఆరోగ్య సమస్యలను నిర్ధారిస్తుంది. మీ జీర్ణక్రియ వ్యవస్థ సరిగ్గా పని చేస్తుందా..? లేదా..? మీరు ఆరోగ్యంగా ఉన్నారా..? లేదా..? అనే విషయాలను మలం రంగును బట్టి తెలుసుకోవచ్చని డాక్టర్ సేథి స్పష్టం చేశారు.
ఎయిమ్స్, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనిర్సవిటీల్లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి మలం రంగుపై ఆసక్తిక విషయాలను వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోను నిర్లక్ష్యం చేయకుండా.. గమనించాలని పేర్కొన్నారు.
మలం రంగు – సమస్యలు ఇలా..
1. బ్రౌన్ కలర్ – నార్మల్
మీ మలం గోధుమ రంగు( Brown Colour )) లో విసర్జితమైతే.. మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. జీర్ణక్రియ సరిగ్గా పని చేస్తుందనడానికి ఒక సంకేతం. మీ కాలేయం కూడా సమర్థవంతంగా పని చేస్తుందని అర్థం.
2. ఆకుపచ్చ రంగు – ఆహారం వేగంగా వెళ్లడం..
మీ మలం ఆకుపచ్చ రంగు( Green Colour )లో కనిపిస్తే.. మీ పేగుల ద్వారా ఆహారం త్వరగా వెళ్తుందని అర్థం. మీ శరీరానికి సరైనంత శక్తిని ఇవ్వకుండా.. త్వరగా విసర్జితమవుతుంది.
3. పసుపు లేదా జిడ్డుగా – కొవ్వు శోషణ సమస్యలు
పసుపు రంగులో లేదా జిడ్డుగా మలం విసర్జితమైతే.. అలాంటి వారు అప్రమత్తం కావాల్సిందే. ఎందుకంటే మీ శరీరం కొవ్వును శోషించుకోలేకపోతోంది. ఇలానే పదేపదే జరిగితే.. తప్పనిసరిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే. కొవ్వు భారీగా పెరిగి అనేక అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.
4. నలుపు రంగు – అంతర్గత రక్తస్రావం
మీ మలం నలుపు రంగులో విసర్జితమైనట్లు అనిపిస్తే.. మీ జీర్ణనాళంలో అంతర్గత రక్తస్రావాన్ని సూచిస్తుంది. దీన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది.
5. ఎరుపు రంగు – జీర్ణనాళంలో రక్తస్రావం
అతి కొద్ది మందిలో మలం ఎరుపు రంగులో విసర్జితమవుతుంది. అంటే దిగువ జీర్ణనాళంలో రక్తస్రావం అవుతున్నట్లు అర్థం. ఇది ఫైల్స్ సమస్యకు దారి తీస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరం. నిరంతర రక్తస్రావాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని డాక్టర్ సేథి నొక్కిచెప్పారు.
గమనిక : ప్రతి రోజు మలం అనేది భిన్న రంగుల్లో కనిపిస్తే భయపడి పోవాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్న ఆహారం వల్ల కూడా రంగులో మార్పు ఉండొచ్చు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరమే లేదు. కానీ నిత్యం పైన చెప్పిన విధంగా ఒకే రంగును పోలిన మలం విసర్జితమైతే.. మీ శరీరంలో ఏదో మార్పు జరుగుతున్నట్లు, మీరు అనారోగ్యానికి గురవుతున్నట్లు గ్రహించాలి. తక్షణమే సంబంధిత డాక్టర్‌ను సంప్రదించాలి.
