Tomatoes | మీకు తెలుసా..? టమాటాతో బరువు తగ్గించుకోవచ్చు..!
Tomatoes | బరువు( Heavy Weight )తో బాధపడుతున్నారా..? అయితే భయపడాల్సిన అవసరమే లేదు. వ్యాయామం( Exercise )తో పాటు కొన్ని ఆహార సూత్రాలు పాటిస్తే.. ఈజీగా బరువు తగ్గొచ్చు( Lose Weight ). నిత్యం మనం వంటకాల్లో వాడే టమాటా( Tomato )తో బరువుతో తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు( Health Experts ) సూచిస్తున్నారు.
Tomatoes | అందం( Beauty )గా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. నాజుకైన నడుముతో, వయ్యారంగా కనిపించాలని కలలు కంటుంది ప్రతి యువతి( Girl ). అందంగా, నాజుగ్గా తయారవ్వాలని బలమైన కోరిక ఉన్నప్పటికీ.. అధిక బరువు( Heavy Weight ) చాలా మందిని వేధిస్తుంది. ఈ బరువును తగ్గేందుకు జిమ్( Gym )కు, వాకింగ్( Walking )కు వెళ్లి కసరత్తులు చేస్తుంటారు. ఇవి కొందరికి వర్కవుట్ అవుతాయి. మరికొందరికి వర్కవుట్ కావు. అయితే వంటింట్లో నిత్యం లభించే టమాటా( Tomato )తో కూడా బరువు తగ్గొచ్చని( Lose Weight ) ఆరోగ్య నిపుణులు( Health Experts ) చెబుతున్నారు. అదేలాగో ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రతి వంటకంలో వినియోగించే టమాటా అధిక బరువును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టమాటాల్లో అధికంగా సీ విటమిన్( Vitamin C ) లభిస్తుందని, దీని ద్వారా విడుదలయ్యే హార్మోన్లు జీర్ణశక్తి( Digestive System )ని పెంచుతాయి. టమాటాలో అతి తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల, సహజంగానే బరువు తగ్గే అవకాశం ఉంది. కొవ్వును కరిగించే రసాయనాలు కూడా టమాటాల్లో అధికంగానే ఉంటాయి. మొత్తంగా శరీరంలోని మలినాలు త్వరగా తొలగిస్తాయి. దీంతో శరీరం ఉల్లాసంగా ఉండడమే కాకుండా, నడుము చుట్టు ఉన్న కొవ్వు కరగడంతో పాటు బరువు తగ్గేందుకు ఆస్కారం ఉందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి రోజుకు ఒక కప్పు టమాటాలు తింటే మంచిదని చెబుతున్నారు. దీంతో రెండు గ్రాముల పీచు లభిస్తుందని, తద్వారా కొలెస్ట్రాల్ కూడా తగ్గుందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.
టమాటా ఎలా తీసుకోవాలి..?
టమాటాలను ఏ రకంగానైనా తీసుకోవచ్చు. వారానికి మూడుసార్లు సూప్ చేసుకుని తాగొచ్చు. సలాడ్‌లోనూ ఉపయోగించవచ్చు. అప్పుడప్పుడు పచ్చి ముక్కలను తీసుకున్నా ఎంతో ప్రయోజనం. చాలా వంటకాల్లో టమాటా ఉపయోగించి తినొచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram