Life style | ఆరోగ్యాన్ని ఆగం చేయడానికి కేవలం మూడు నైట్ షిఫ్టులు చాలట..!
Life style : పని ఒత్తిడి (Work pressure), ఆహారపు అలవాట్లు (Food habits), అతిగా జంక్ ఫుడ్స్ తినడం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం లాంటివి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఇప్పటికే పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే నైట్ షిఫ్టులు కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని తాజాగా ఒక అధ్యయనం తెలిపింది.
Life style : పని ఒత్తిడి (Work pressure), ఆహారపు అలవాట్లు (Food habits), అతిగా జంక్ ఫుడ్స్ తినడం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం లాంటివి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఇప్పటికే పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే నైట్ షిఫ్టులు కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని తాజాగా ఒక అధ్యయనం తెలిపింది. మధుమేహం (Diabetics), ఊబకాయం (Obesity) లాంటి జీవక్రియ రుగ్మతలు పెరగడానికి కేవలం మూడు నైట్ షిఫ్టులు చాలని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.
అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో నైట్ షిఫ్టుల వల్ల రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు సంబంధించిన ప్రోటీన్ రిథమ్స్ దెబ్బతింటాయని తేలింది. ఇది శక్తి ఉత్పాదక జీవక్రియను అడ్డుకోవడమే కాకుండా దీర్ఘకాలిక జీవక్రియ ప్రక్రియను ప్రభావితం చేస్తుందని వెల్లడించింది. ప్రొటీన్ రిసెర్చ్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో ‘మెదడులోని మాస్టర్ బయోలాజికల్ క్లాక్’ గురించి కూడా పరిశోధన బృందం వివరించింది.
ఈ మాస్టర్ బయోలాజికల్ క్లాక్ పగలు, రాత్రి శరీర లయలను నియంత్రణ చేస్తుంది. అయితే ఇది క్రమరహితమైతే దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుందని ప్రొఫెసర్ హన్స్ వాన్ డాంగెన్ తెలిపారు. కేవలం మూడు నైట్ షిఫ్ట్‌లు శరీర జీవక్రియల లయను దెబ్బతీయడానికి, ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడానికి సరిపోతాయని ఆయన చెప్పారు. ఇది మధుమేహం, ఊబకాయం రిస్క్‌ను పెంచుతుందని, దాన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచించారు.
పరిశోధనా బృందం రక్త నమూనాలను ఉపయోగించి రక్తం ఆధారిత రోగనిరోధక వ్యవస్థ కణాల్లో ఉన్న ప్రొటీన్‌లను గుర్తించింది. వీటిలో కొన్ని లయలు మాస్టర్ బయోలాజికల్ క్లాక్‌తో ముడిపడి ఉన్నట్లు గమనించింది. రాత్రి పూట పనిచేయడంవల్ల చాలా వరకు ప్రోటీన్లలో మార్పు వచ్చింది. గ్లూకోజ్ నియంత్రణలో పాల్గొంటున్న ప్రొటీన్లను విశ్లేషించడం ద్వారా నైట్ షిఫ్ట్‌లో పనిచేసే వారిలో గ్లూకోజ్ లయలు పూర్తిగా మారడాన్ని కనిపెట్టింది.
నైట్ షిఫ్టులలో పనిచేసే వాళ్లలో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా ప్రభావితమైనట్లు పరిశోధకులు కొనుగొన్నారు. దీనికి అదనంగా గతంలో కొన్ని అధ్యయనాలు నైట్ షిఫ్టులు రక్తపోటు (బీపీ)పై ప్రతికూల ప్రభావం చూపుతాయని రుజువు చేశాయి. రక్తపోటుపై ప్రతికూల ప్రభావం గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్‌ను పెంచుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram