Inspiring | సంకల్పానికి ప్రతీక.. డాక్టర్ నుంచి మేజర్‌గా ఎదిగిన తొలి మహిళ కథ తెలుసా?

భారత సైన్యంలో మరో స్ఫూర్తిదాయక ఘట్టం సాక్ష్యం అయింది. అస్సాం రాష్ట్రానికి చెందిన డాక్టర్‌ దిపానితా కళిత దేశంలోనే తొలి మహిళా పారా ట్రూపర్‌గా అరుదైన గుర్తింపు పొందారు. వైద్య వృత్తిని వదిలి సైనిక సేవలో అడుగు పెట్టి, అక్కడ కూడా అత్యంత కఠినమైన పారా ట్రూపర్ పరీక్షలను అధిగమించడం ఆమె సంకల్పబలానికి నిదర్శనంగా నిలిచింది.

అస్సాం, మయోంగ్‌ ప్రాంతానికి చెందిన దిపానితా చిన్నప్పటి నుంచే సమాజానికి ఉపయోగపడే పని చేయాలని ఆరాటపడుతూనే వచ్చారు. మొదట వైద్య విద్య పూర్తి చేసి డాక్టర్‌గా సేవలందించిన ఆమె, తరువాత మరింత పెద్ద స్థాయిలో దేశ సేవ చేయాలనే భావనతో భారత సైన్యంలో చేరారు. మెడికల్ అఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమెకు పారా ట్రూపర్‌ వింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తినే సంకల్పంగా మార్చుకుని, అత్యంత క్లిష్టమైన శారీరక, మానసిక పరీక్షల్లో విజయం సాధించారు.

పారా ట్రూపర్‌గా మారటం సైన్యంలో అత్యంత కఠినమైన లక్ష్యాలలో ఒకటి. కఠిన శిక్షణ, ప్రమాదకరమై ఈవెంట్స్, మానసిక పరీక్షలు. ఇవన్నీ సమర్థవంతంగా ఎదుర్కొని ‘మరూన్‌ బెరెట్‌’‌ను పొందడం ఆమె ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచింది. దిపానితా విజయం కేవలం ఆమె వ్యక్తిగత సాధన మాత్రమే కాదు, భారత సైన్యంలో మహిళల సామర్థ్యాన్ని మరొకసారి ప్రపంచానికి చాటిచెప్పిన ఘట్టంగా నిలిచింది.

తాజాగా దిపానితా ‘ఫెమినా’ పత్రిక కవర్‌పేజీపై చోటు దక్కించుకోవడం దేశవ్యాప్తంగా మరింత చర్చనీయాంశంగా మారింది. పారా ట్రూపర్‌గా మారిన వైద్యురాలు అనే అరుదైన ప్రయాణం ఆమెను లక్షలాది మంది యువతకు ఆదర్శంగా నిలబెట్టింది. అస్సాం నుంచి దేశ సేవలో ముందుకు దూసుకెళ్లిన దిపానితా కథ ఎందరికో స్ఫూర్తిదాయకంగా మారింది. కలలు ఎంత పెద్దవైనా కృషి చేస్తే సాధ్యమేనన్న సందేశాన్ని యోధరాలు దిపానితా కథ తెలియజేస్తోంది.