హైదరాబాద్ : అపోలో హాస్పిటల్, ఫార్మాసి అధినేత, హీరో రాంచరణ్ సతీమణి కొణిదెల ఉపాసన విదేశీ టాయిలెట్స్ కు బై చెప్పండి..స్వదేశీ టాయిలెట్స్ యూజ్ చేయండి అంటూ కొనసాగిస్తున్న ప్రచారం నెటిజన్లను ఆలోచింప చేస్తుంది. వేల కోట్ల ఆస్తులకు వారసురాలైనప్పటికి..ప్రజల ఆరోగ్యాన్ని కోరుకుంటూ అపోలో లైఫ్ పేరిట స్వదేశీ టాయిలెట్స్ వినియోగంపై మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ స్వయంగా చేస్తుండటం నెటిజన్ల ప్రశంసలను అందుకుంటుంది.
నేటి తరానికి టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో స్వయంగా కొణిదెల ఉపాసన చేసి చూపిస్తూ..విదేశీ టాయిలెట్ కి స్వస్తి చెప్పి.. మన టాయిలెట్ విధానాన్ని అలవాటు చేసుకోండని ప్రచారం నిర్వహిస్తుంది. స్వదేశీ టాయిలెట్స్ వినియోగం వలన మన శరీరానికి, ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఉపాసన వెల్లడిస్తున్నారు.
విదేశీ టాయిలెట్ విధానం వల్ల వెనక నుంచి వాష్ చేస్తారని.. అలా చేయడం వల్ల ఫైల్స్ వచ్చే అవకాశం ఎక్కువని, స్వదేశీ టాయిలెట్ విధానం వల్ల ముందు నుంచి వాష్ చేసుకుంటే ఫైల్స్ తోపాటు పోట్ట మీద వత్తిడి పడి పోట్టకు మంచి వ్యాయామం కూడా అవుతుందని, ఫైల్స్ వంటి సమస్యలు ఉండవని సూచిస్తున్నారు. బిగ్ సెలబ్రెటిగా ఉండి కూడా ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను కాంక్షిస్తూ.. మన టాయిలెట్ విధానాన్ని ప్రమోట్ చేస్తున్న ఉపాసన నిజంగా అందరికి స్ఫూర్తిదాయం అని.. హ్యాట్సాఫ్ మేడం అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
అమెరికా – ఇరాన్ మధ్య రేపు రెండో దశ శాంతి చర్చలు జరిగేనా!
Mega Heroes | మెగా ఫ్యామిలీ హీరోలకి వరుస సర్జరీలు… ఆందోళన చెందుతున్న అభిమానులు
