Crocodile | ఏం ధైర్యం స‌ర్.. స్కూటీపై మొస‌లిని తీసుకెళ్లిన ఫారెస్ట్ ఆఫీస‌ర్స్.. వీడియో

Crocodile | గుజ‌రాత్ ( Gujarat ) వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు( Rains ) కురుస్తున్నాయి. ఈ వ‌ర్షాల‌కు మొస‌ళ్లు( Crocodiles ) ఎక్క‌డంటే అక్క‌డ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇక వ‌డోద‌ర‌ ( Vadodara ) లోని కాల‌నీల్లో మొస‌ళ్లు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి. అయితే ఓ మొస‌లిని ఫారెస్టు అధికారులు( Forest Ifficers ) స్కూటీపై తీసుకెళ్లిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Crocodile | ఏం ధైర్యం స‌ర్.. స్కూటీపై మొస‌లిని తీసుకెళ్లిన ఫారెస్ట్ ఆఫీస‌ర్స్.. వీడియో

Crocodile | గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర‌లో వాన‌లు దంచికొడుతున్నాయి. ఈ భారీ వ‌ర్షాల‌కు న‌దులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. అయితే విశ్వ‌మిత్రి న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. ఈ న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుండ‌డంతో న‌దిలోని మొస‌ళ్లు.. వ‌డోద‌ర‌లోకి ప్ర‌వేశిస్తున్నాయి. కాల‌నీల‌తో పాటు రోడ్ల‌పై మొస‌ళ్లు సంచ‌రిస్తుండంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ఈ నేప‌థ్యంలో క‌నిపించిన మొస‌ళ్ల‌ను క‌నిపించిన‌ట్లే అట‌వీ శాఖ అధికారులు ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. అయితే ఓ ఇద్ద‌రు అధికారులు స్కూటీపై మొసలిని తీసుకెళ్లారు. ఓ అధికారి స్కూటీ వెనుకాల కూర్చొని మొస‌లిని ధైర్యంగా ప‌ట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. మ‌రి మీరు కూడా ఓ లుక్కేయండి..