High Court of Karnataka | ఖర్చుల కోసం నెలవారి భరణం 6లక్షల 16,300 కావాలి..మహిళపై న్యాయమూర్తి ఆగ్రహం

భర్త నుంచి నెలకు రూ.6 లక్షలకుపైగా భరణం కోరిన ఆ మహిళపై న్యాయమూర్తి మండిపడ్డారు. ఒక మహిళ తన భర్త నుంచి నెలకు రూ.6 లక్షలకుపైగా భరణం డిమాండ్‌ చేసింది దీంతో న్యాయమూర్తి ఆ మహిళపై మండిపడ్డారు.

  • By: Subbu |    national |    Published on : Aug 22, 2024 4:27 PM IST
High Court of Karnataka | ఖర్చుల కోసం నెలవారి భరణం 6లక్షల 16,300 కావాలి..మహిళపై న్యాయమూర్తి ఆగ్రహం

అంత ఖర్చులంటే నీవే సంపాదించుకోవాలని చురకలు

విధాత, హైదరాబాద్ : భర్త నుంచి నెలకు రూ.6 లక్షలకుపైగా భరణం కోరిన ఆ మహిళపై న్యాయమూర్తి మండిపడ్డారు. ఒక మహిళ తన భర్త నుంచి నెలకు రూ.6 లక్షలకుపైగా భరణం డిమాండ్‌ చేసింది దీంతో న్యాయమూర్తి ఆ మహిళపై మండిపడ్డారు. భర్తకు దూరంగా ఉంటున్న రాధ మునుకుంట్ల అనే మహిళ భరణం కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24 ప్రకారం భర్త నుంచి నెలకు రూ.6,16,300 భరణం డిమాండ్‌ చేసింది. రాధ నెలవారీ ఖర్చుల వివరాలను ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. దుస్తులు, షూ, బ్యాంగిల్స్, ఇతర ఉపకరణాల కోసం నెలకు రూ.15,000, ఆహారం కోసం నెలకు రూ. 60,000, మోకాళ్ల నొప్పులు, ఫిజియోథెరపీ, వైద్య ఖర్చుల కోసం నెలకు రూ.4 నుంచి రూ.5 లక్షలు ఇప్పించాలని కోర్టును కోరింది. కుటుంబ బాధ్యతలు లేని ఒంటరి మహిళకు అంత ఖర్చులు అవసరమా అని ప్రశ్నించారు. ప్రాథమిక అవసరాల కంటే విలాసవంతమైన కోరికలను ఆమె ప్రస్తావించినట్లుగా ఉందన్నారు. ‘దయచేసి ఒక వ్యక్తికి అంత అవసరమని కోర్టుకు చెప్పకండని మందలించారు. నెలకు రూ. 6,16,300 ఎవరైనా ఇంత ఖర్చు చేస్తారా? తన కోసం ఖర్చు చేయడానికి ఆమెను సంపాదించనివ్వండి’ అని ఆ మహిళ తరుఫు న్యాయవాదితో అన్నారు. ‘సెక్షన్ 24 ఉద్దేశం అది కాదని, భార్యతో వివాదం ఉన్న భర్తకు శిక్ష కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఖర్చుల కోసం ఆమె సంపాదించుకోవాలే తప్ప భర్తను డిమాండ్ చేయడం సరికాన్నారు. డిమాండ్లను సవరించకపోతే పిటిషన్‌ కొట్టివేస్తామని హెచ్చరించారు.